Thursday, May 16, 2024
- Advertisement -

అమెరికాలో అదరగొట్టిన ప్రధాని

- Advertisement -

నరేంద్ర మోదీ. భారతదేశ ప్రధానమంత్రి. అమెరికా కాంగ్రెస్ సభ్యుల మనసు దోచుకున్నారు. వాళ్లకు అది చేస్తాం.. ఇది చేస్తాం అనో.. దొంగ లెక్కలు చూపించో కాదు.. కేవలం తన వాక్చాతుర్యంతో వారిని ఆట్టుకున్నారు. బుధవారం నాడు అమెరికా కాంగ్రెస్ లో సమావేశంలో మాట్లాడిన నరేంద్రమోదీ ప్రసంగానికి తొమ్మిది సార్లు అమెరికా కాంగ్రెస్ సభ్యులు లేచి నిలబడి హర్షద్వానాలు చేశారు.

నరేంద్ర మోదీకి వైట్ హౌస్ ప్రశంసల జల్లు కురిపించారు. అమెరికాతో భారత్ కు త్వరలో కీలకమైన లాజిస్టిక్ ఒప్పందం కుదుర్చుకోనుంది. నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మీది ఎంతో చరిత్ర ఉన్న ప్రజాస్వామ్య దేశం.. మాది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. మీ చట్టసభలో ప్రసంగించడమంటే 125 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం అని అన్నారు.

ఇరు దేశాల మధ్య ఉన్న స్వేచ్ఛా విలువలను పంచుకుందామని అన్నారు. ప్రధాని ప్రసంగానికి 72 సార్లు సభ్యులు లేచి నుంచుని చప్పట్లు కొట్టారు. భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ  ఇచ్చిన స్ఫూర్తినే మార్టిన్ లూధర్ కింగ్ దొరకబుచ్చుకున్నారని ప్రధాని అన్నారు. ప్రపంచంలో మూలమూలలకు ఉగ్రవాదం చేరుతోందని, దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. పేరు ఏదైనా.. దేశం ఏదైనా.. లష్కరే తోయిబా అనండి, ఆల్ కాయిదా అనండి, ఐఎస్ఐఎస్ అనండి.. వారందరి భాష ఒక్కటే. అదే ఉగ్రవాదం. దానిపై మనం సమష్టి పోరు సాగించాల్సిందే అనిప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -