Sunday, May 5, 2024
- Advertisement -

దేశంలో అత్యంత ధనవంతమైన బెగ్గర్స్ వీరే..!

- Advertisement -

ఎవరైనా మనల్ని ముష్టెత్తుకుని బతకరా అంటే.. తిట్టాడుకనుకోవద్దు. జస్ట్ దీవించారనుకోండి. ఇలా ఎందుకనుకోవాలంటే..ముష్టి అవతారమెత్తి లక్షలు లక్షలు సంపాదిస్తున్నవారు చాలామందే ఉన్నారు.

అలా అని చెప్పి బెగ్గర్స్ అందరూ గొప్పవారని ధనికులని అనడానికి వీల్లేదు. మీకు తెలుసో లేదో… దేశంలోని చాలా మందికి వీరి సంపాదనలో పది శాతం కూడా ఉండదు. సో  అలాంటప్పుడు వీరి గురించి మనం తెలుసుకునే తీరాలి. దేశంలో అత్యంత ధనవంత మైన యాచకుల్లో  ఓ ఐదుగురు గురించి మనం తెలుసుకుందాం.

 

1) భరత్ జైన్. ముంబయ్ లో మకాం. ఆస్థి ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 లచ్చలు .అదేనండి బాబు 80లక్షలు. మార్కెట్ విలువ మాత్రం దానికి రెట్టింపుంది. కేవలం యాచన ద్వారానే అబ్బాయిగారికి

 రోజుకు 2500-3000 వరకు ముడుతోంది. ఆ లెక్కన చూస్తే….నెలకు ఇతని ఆదాయం 75000 రూపాయలు. ముంబయ్ లోని పరేల్ ప్రాంతంలో ఇతనికి రెండు ఫ్లాట్లున్నాయి వాటిని అదెక్కిచ్చాడు.

 ఈయనకు మరో షాప్ కూడా ఉంది అది కూడా అద్దెకిచ్చాడు.

2) కృష్ణకుమార్. ఈయనగారిది ముంబయ్ లోనే మకాం. ఇతని ఆస్థి 45లక్షల రూపాయలు. యాచకంతో వచ్చేది రోజుకు 2000-3000 రూపాయలు. ఇక నెల ఆదాయం అంటారా….60000.

3) శంభాజీ కాలే. ముంబయ్ లోనే మకాం. ఆస్థి ప్రభుత్వ లెక్కల ప్రకారం 34 లక్షల రూపాయలు. ముష్టెత్తుకుంటూ….రోజుకు1500-2000 సంపాదిస్తాడు . నెల ఆదాయం 51వేలు.ఆల్మోస్ట్ ఐటి ఎంప్లాయ్ అన్నమాట.

4) మలానా. ముంబయ్ లోనే కనిపిస్తూ ఉంటాడు. ఆస్థి ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 లక్షలు. యాచన ద్వారా రోజుకు1500-2000 సంపాదిస్తాడు. నెలకు  ఆదాయం ఎంతలేదన్నా 45 వేల రూపాయలు.

5) హాజీ. ఈయనగారు కూడా ముంబయ్ లోనే ఉంటారు. ఇతని మొత్తం ఆస్థి ప్రభుత్వ లెక్కల ప్రకారం15 లక్షలు. యాచన ద్వారా రోజుకు 1000-1500 సంపాదిస్తున్నాడు. నెలసరి ఆదాయం 30 వేలు. 

ఈ ఐదుగురు  యాచకులు రోజుకు 6 నుండి 8 గంటలు మాత్రమే పని చేస్తారు. మిగతా టైం హాయిగా తమకు నచ్చినట్లుగా జీవితాన్ని గడుపుతారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకన్నా ఎక్కువగా వీరు సంపాదిస్తున్నారు. 

అయితే ఇక్కడ తెలుసుకోవల్సిన ఇంకో విశేషం…. ఇప్పటి వరకు మనం నేషనల్ మీడియా ఫోకస్ చేసినటువంటి కాన్సెప్ట్ ను మాత్రమే తెలుసుకున్నాం. వారికి ముంబయి మాత్రమే కనిపించింది.

కాని మన హైదరబాద్ కు దగ్గర్లో ఉన్నటువంటి… చిలుకూరి బాలాజి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి యాచకులు కనిపించలేదు. ఎందుకంటే ఈ ముంబాయి బిచ్చగాళ్లకంటే ఎక్కువ ఆస్తి మన చిలుకూరి బాలాజి టెంప్ కు సమీపంలో ఉన్నటువంటి బిచ్చగాళ్లకు ఉంది. అయితే వారికి యాచకంతో వచ్చే సంపాదన తక్కువే అయినా… భూముల రూపంలో ఉన్న స్థిరాస్తి విలువ కోటికి పైగా ఉంది. సో యాంగిల్లో చూసినపుడు టాప్ 5లో ఉండేది మనవారే కదా.

{youtube}MmRll0lL_Y4{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -