- Advertisement -

ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు..విచారణ వేగవంతం

- Advertisement -

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రంజన్ భార్య తనూజా రంజన్ హత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. హత్య అనంతరం దోపిడీకి పాల్పడిన నిందితులు రాష్ట్రం దాటి పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను వేగవంతం చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుల కదలికలకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు లభించాయి.హత్య మరియు దోపిడీ అనంతరం నిందితులు నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకుని, అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

ఇల్లు మరియు నాంపల్లి స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, నిందితులకు సంబంధించిన దృశ్యాలను సేకరించారు. ఈ మేరకు అనుమానితుల ఫోటోలను కూడా విడుదల చేశారు.నిందితులను పట్టుకునేందుకు పోలీస్ కమిషనర్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లాయి.

ఇప్పటికే అధికారులు ముంబై, లక్నో మరియు ఢిల్లీ నగరాలకు చేరుకుని స్థానిక పోలీసుల సాయంతో సోదాలు నిర్వహిస్తున్నారు. నిందితులు దేశం దాటి పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో, ఒక బృందం ఇప్పటికే నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంది. అక్కడ సరిహద్దు భద్రతా బలగాల సహకారంతో నిఘా పెట్టారు.

ఈ కేసులో ప్రధాన అనుమానితురాలిగా భావిస్తున్న పనిమనిషి కల్పన గత చరిత్రను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.గతంలో కల్పన లక్నోలో ఒక ఇంట్లో పనిచేసినట్లు గుర్తించిన పోలీసులు, అక్కడికి వెళ్లి సదరు ఇంటి యజమానిని విచారించారు.హత్య జరిగిన సమయంలో కల్పనతో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ఎవరు? కల్పనకు వారితో ఉన్న సంబంధం ఏమిటి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

పోలీసులు విడుదల చేసిన ఫోటోల ఆధారంగా నిందితుల గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని అధికారులు కోరారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని భరోసా ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -