ఏపీ హైకోర్టులో ఐపీఎస్ సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. తనపై నమోదైన కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సునీల్ నాయక్ కోర్టుకు తెలిపారు. తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
తనకు ఎలాంటి పరారీ ఉద్దేశం లేదని, విచారణ ప్రక్రియలో అవసరమైన సమాచారాన్ని అందిస్తానని కోర్టుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అరెస్ట్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణర్హత లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు.
రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, తుది తీర్పును ఈనెల 13 వరకు రిజర్వ్ చేసింది. కోర్టు నిర్ణయం వెలువడే వరకు ఈ కేసు పై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సునీల్ నాయక్ పిటిషన్‌పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
