Saturday, May 4, 2024
- Advertisement -

పనికిరాని కొత్త రూ.2 వేల నోటు..!

- Advertisement -
New rs. 2000 currency is not valid?

హైదరాబాద్: దేశం మొత్తం ఇప్పుడు చర్చించుకుంటున్న ఏకైక విషయం నోట్ల రద్దు. బడాబాబులు తమ వద్దనున్న లక్షల డబ్బును ఎలా మార్చుకోవాలా అని కంగారు పడుతుంటే సామాన్యులు మాత్రం చిల్లర దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్త రూ.2000 నోటును

బ్యాంకు నుంచి తీసుకున్నప్పటికీ దానికి సరిపడ చిల్లర దొరక్క నిరుపయోగంగా మారింది. మరో రకంగా చెప్పాలంటే పాత నోట్లు కాదు చెల్లనివిగా మరింది కొత్త నోట్లు చెల్లనివిగా మారాయి. వెయ్యనోటు లేకపోవడంతో పాటు మరోపక్క కొత్త రూ. 500 నోటు కూడా సరిగా అందుబాటులోకి రాకపోవడంతో అంతా ఇబ్బంది పడుతున్నారు. జేబులో డబ్బులు ఉన్నప్పటికీ ఖర్చు చేయలేని పరిస్థితి. 

అయితే చాలా మందికి కొత్త రెండు వేల నోటు ఇంకా పూర్తి అవగాహనలోకి రాలేదు. దీంతో ఈ పరిస్థితిని దుర్వినియోగం చేయాలని భావిస్తోన్న కొంత మంది కలర్ జిరాక్స్‌లు తీసి చాలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో అయితే ఇప్పటికే కొత్త నకిలీ నోట్లను ముద్రించడం మొదలు పెట్టారని పుకార్లు కూడా నడుస్తున్నాయి. కొత్త నోట్లను మార్చుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారనేది వాస్తవం. బ్యాంకులతోపాటు, ఎటిఎంలలో సైతం అధిక సమయం పాటు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తోంది. దీంతో పెళ్లి, ఆరోగ్యం వంటి అత్యవసరాలు ఉన్నవాళ్లు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని రోజులపాటు దేశ ప్రజలు సహకరించాలని ప్రధాని మోడీ కోరిన సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -