Wednesday, May 15, 2024
- Advertisement -

సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీకి ఉండబోదా!

- Advertisement -

దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఐడెంటిఫికేషన్ ‘సైకిల్’ గుర్తు. ఆ పార్టీ ఉత్తాన్నపతనాలు సైకిల్ గుర్తుపైనే జరిగాయి.

సామాన్యుడి వాహనం అయిన సైకిల్ ద్వారా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కూడా అధికారాన్ని సాధించుకొంది. అయితే ఇప్పుడు సైకిల్ తో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధానికి తెరపడే అవకాశాలున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరి ఉన్నఫలంగా తెలుగుదేశం పార్టీకి.. సైకిల్ గుర్తుకు వచ్చిన ప్రమాదం ఏమిటి? అంటే.. జాతీయ రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి ఈ ఇబ్బందిని తెచ్చి పెట్టాయి. భారతీయ జనతా పార్టీ ఆట కట్టించడానికి అంటూ ఉత్తరాదిలోని వివిధ పార్టీలు ఏకం అయ్యాయి. జనతా పరివార్ పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకొన్నాయి. సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యూనైటెడ్ , జనతా దళ్ సెక్యులర్ వంటి పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి.
మరి అవన్నీ కలిసి ఒక రాజకీయ పార్టీగా మారి..ఇకపై తమది సైకిల్ గుర్తు అని ప్రకటించుకొన్నాయి! ఈ మేరకు ఎన్నికల కమిషన్ ను కోరు కొన్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ ది సైకిల్ గుర్తే. ఆ పార్టీ నాయకత్వంలో విలీనం జరిగినట్టుగా. ఇకపై ఆ పార్టీ గుర్తే ఈ కూటమిది అవుతుందని వీరు చెబుతున్నారు. మరి ఈ కూటమికి జాతీయ పార్టీ గుర్తింపు లభిస్తే.. ఎన్నికల సంఘం ఈ పార్టీకే సైకిల్ గుర్తు లభిస్తే.. తెలుగుదేశం పార్టీకి ఇబ్బందేనేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -