- Advertisement -

అలాంటి చిల్లర పనులు చేయలేనంటున్న జగపతిబాబు..!

- Advertisement -

అవార్డులు… ఈ మధ్యపూర్తిగా రాజకీయమయం అయినవి. ఒకటని కాదు.. సుబ్బరామిరెడ్డి వంటివ్యక్తులు ఇచ్చే అవార్డుల దగ్గర నుంచి జాతీయ అవార్డుల వరకూ ప్రతిదాంట్లోనూ రాజకీయమే ప్రభావితం చేస్తోందనే విమర్శలున్నాయి.

ప్రత్యేకించి పద్మ అవార్డుల విషయంలో అయితే వివాదాలకు లెక్కేలేదు. అధికారంలో ఉన్న పార్టీల ఇష్టానుసారమే ఈ అవార్డుల ప్రదానం జరుగుతోందనే అభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ హయాంలో అయినా.. ఇప్పుడు బీజేపీ హయాంలో అయినా.. ఈ విమర్శలు తప్పడం లేదు. 

ఇటీవలపద్మ అవార్డుల విషయంలో ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి పద్మ అవార్డుల కోసం వెళ్లిన ప్రతిపాదనల్లో కొందరు తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల పేర్లున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బాగా దగ్గర వ్యక్తిఅయిన ఒక నిర్మాత కమ్ నటుడు పేరు ఈ జాబితాలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో మీడియా జగపతి బాబు వద్ద పద్మ అవార్డుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఇప్పటికే దశాబ్దాల నట జీవితాన్ని కలిగిన మీరు పద్మశ్రీ అవార్డునైనా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారా? అని మీడియా ఆరాతీసింది. అయితే..జగపతి మాత్రం తనకు అలాంటి ఆలోచనలే లేవని స్పష్టం చేశాడు.

అవార్డుల కోసం తను లాబీయింగ్ చేసుకోలేని.. అలా దిగజారలేనని జగపతి స్పష్టం చేశాడు. అలా సాధించుకున్న అవార్డులతో ఆనందించాలని తను అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేశాడు. మరి జగపతిబాబు మాటలు అభినందించదగినవే అని చెప్పాలి. మరి అవార్డుల కోసం లాబీయింగ్ లు చేసుకుంటున్నవారికి జగపతి మాటలు చెంపపెట్టే అని కూడా అనాలేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -