Wednesday, May 22, 2024
- Advertisement -

పేరు మార్చిన తమిళనాడు ప్రభుత్వం

- Advertisement -

ప్రముఖ యాత్రాస్ధలం, దేశంలో దక్షిణాదిలో చిట్టచివరి పట్టణం కన్యాకుమారి పేరు మారింది. ఇన్నాళ్లూ కన్యాకుమారిగా వ్యవహరించిన ఈ పట్టణం పేరు ఇక నుంచి కన్నియ కుమారిగా మారింది. ఇంతకు ముందు ఈ పేరే ఉన్నప్పటికి బ్రిటీష్ వారి పాలనలో వారి నోరు తిరగక కన్యాకుమారిగా మార్చారు. అప్పటి నుంచి అదే పేరు కొనసాగుతోంది.

దీనిపై స్ధానికంగా ఆందోళనలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం పాత పేరు కన్నియ కుమారిగా మార్చాలంటూ క్రేంద్రానికి వినతి చేయడంతో కేంద్రం అనుమతించింది. దీంతో ప్రభుత్వం కన్యాకుమారి పేరును కన్నియ కుమారిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పట్టణం పేరు మార్చడంలో పలు వ్యాపార సంస్ధలు, ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు మారాయి. ఇక నుంచి వెబ్ సైట్లు, రైలు, రోడ్డుతో పాటు అన్ని చోట్లీ కన్నియ కుమారిగానే వ్యవహరించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -