Wednesday, May 15, 2024
- Advertisement -

కేసీఆర్ గారూ అప్పుడు ఆ మాటలు ఎందుకండీ..!

- Advertisement -

రేపు ఏం జరుగుతుంతో ఊహించడం కూడా మనిషి కి మేధస్సుకు సాధ్యం కాదు. రేపటి మీద ఆశలు పెట్టుకోవడమే తప్ప… అనుకొన్నది కచ్చితంగా జరుగుతుందని… అనుకోవడానికి లేదు.

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం. రాజకీయాల్లో కూడా ఇంతే.. ఈ ప్రిడిక్షన్స్ అస్సలు పనికిరావు. రేపు ఏ జరుగుతుందో తెలియని పరిస్థితే ఉంటుంది పాలిటిక్స్ లో.

ఐదేళ్ల కిందట ఇదే సమయంలో రాష్ట్ర విభజన జరుగుతుందని ఎవరైనా ఊహించారా? వైఎస్సార్ మరణిస్తాడని… రాజకీయాల్లో ఎన్నో మార్పులు వస్తాయని ఎవరైనా అనుకొన్నారా? అయితే.. ఎన్నో జరిగాయి. పరిస్థితులు మారిపోయాయి. మరి ఇలాంటి రాజకీయ పరిణామాల గురించి ముందుగా మాట్లాడటం అనవసరమే.
ఇలాంటి అనవసరమైన పనే చేస్తున్నట్టుగా ఉన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ యన వచ్చే ఎన్నికల గురించి మాట్లాడాడు! తెలంగాణలో 2019 ఎన్నికల్లో కూడా తమదే విజయం అని కేసీఆర్ నొక్కివక్కాణించాడు. పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో కేసీఆర్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని సొంతం చేసుకొంటామని వ్యాఖ్యానించాడు తెలంగాణ ముఖ్యమంత్రి.
మరి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కనీసం నాలుగేళ్ల వ్యవధి ఉంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడటం ఎందుకో! అంత తొందర ఎందుకో..ఇది ఆత్మవిశ్వాసమా..అతి విశ్వాసమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -