Saturday, May 18, 2024
- Advertisement -

ఏ.టి.ఎం పిన్ మర్చిపోతే ఇలా చేయండి!

- Advertisement -
lost atm pin

ఎవరైన ఏ.టి.ఎం పిన్ మర్చిపోతే వెంటనే ఆ కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డు కి ఆప్లై చేయడం చేస్తాం. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో.. అలాంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. బ్యాంకు కు వెళ్ళే అవసరం కూడా లేదు. కేవలం కొద్ది నిమిషాలలో మీ పిన్ తెలుసుకోవచ్చు.

ఏ.టి.ఎం పిన్ తెలుసుకోడానికి మీకు కావలసినవి:

1. ATM కార్డ్

2. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్

3. మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్.

మీకు దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్ లోకి వెళ్లి మీ కార్డు ని పెట్టండి. ఆ తర్వాత..

1. Banking అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి

2. Pin Generate లేదా ATM Pin reset అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి

3. మీ Account Number ని ఎంటర్ చేయండి

4. మీ Phone number ఎంటర్ చేయండి

5. మీ ఫోన్ కి OTP (One Time Password) వస్తుంది

6. OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ ని మార్చితే సరిపోతుంది. పాత పిన్ డిలీట్ అయ్యి కొత్త పిన్ ఆక్టివేట్ అవుతుంది.

చాలా ఈజీ గా మీ ఏ.టి.ఎం పిన్ ని పొందవచ్చు. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి..

Related

  1. మీ ఏటిఎం కార్డులను యాప్ తో కనెక్ట్ చేసుకోవచ్చు!
  2. పాత నోట్లను RBI ఏం చేస్తుందో తెలుస్తే షాక్ అవుతారు!
  3. రామ్ చరణ్ కోసం కేటీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా?
  4. ఏటీఎం వద్దకు వెళ్లకుండా.. డబ్బు తెచ్చుకుంటున్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -