Thursday, May 16, 2024
- Advertisement -

ఉగ్ర‌వాదుల వేట‌కు భారీ సెర్చ్‌ ఆర్మీ అప‌రేష‌న్ సురూ….

- Advertisement -
Major search operation in Jammu and Kashmir Security forces cordon search

భార‌త్‌లో ఉగ్ర‌వాదు దాడులు పెరిగిపోవ‌డంతో కేంద్రం క‌ఠిన నిర్న‌యాల‌ను తీసుకుంటోంది. ఇప్పటికే యూరీ పటాన్ కోట్ అటాక్స్ తో రగులుతున్న భారతీయులు తాజగా పాకిస్థాన్ పాల్పడిన మరో దురాగతంపై కేంద్రం తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. తాజాగా పెట్రోలింగ్‌ చేస్తున్న ఇద్దరు భారత జవాన్లపై దాడి చేసి అత్యంత క్రూరంగా వారి తలలు నరికేసింది.

ఉగ్రవాదుల సాయంతో సరిహద్దుల్లో భారత సైన్యంపై దాడులకు తెగబడుతున్న పొరుగుదేశం.. ఈసారి ఏకంగా ఆర్మీనే రంగంలోకి దించి దొంగదెబ్బ కొట్టింది.దీంతో ర‌గిలి పోతున్న కేంద్రం సెక్యూరిటీ ఆపరేషన్స్ సెర్చ్‌ను ప్రారంభించింది. కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, దాడులకు పాల్పడుతున్నారని వరుసగా వీడియోలు విడుదలవుతుండటంతో భద్రతా దళాలు భారీ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ ను ప్రారంభించాయి. గడచిన సంవత్సర కాలంలో ఎన్నడూ లేనంత పెద్ద ఆపరేషన్ ను ప్రారంభించాయి.

హిజ్బల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం పరిస్థితులు విషమించగా, కాశ్మీర్ ముస్లిం యువత రాళ్ల దాడులకు దిగుతుండటం, పోలీసుల కాల్పుల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో, కేంద్రం ఆదేశాల మేరకు తమ సెక్యూరిటీ ఆపరేషన్స్ నిలిపివేసిన సైన్యం, తిరిగి ఇప్పుడు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కదిలింది. జ‌మ్మూ&కాశ్మీర్ సోఫియా జిల్లాలోని 20 గ్రామాల‌లో సెర్చ్ అప‌రేష‌న్‌ను ప్రారంభించారు.

ఏకంగా 3 వేల మందికి పైగా సైన్యం, సీఆర్పీఎఫ్ దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ భారీ సెర్చ్ అప‌రేష‌ణ్‌ను ప్రారంబించాయి. ఈ ఉదయం నుంచి గ్రామాలు, అడవులను జల్లెడ పతుతున్నారు. గత కొంతకాలంగా సోపియాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఆయుధాలు ధరించి సంచరిస్తున్న వీడియోలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. దాదాపు 100 మంది వరకూ స్థానిక యువకులు సైతం ఉగ్రవాదుల్లో చేరిపోయారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా సైనికులపై దాడులు పెరగడం, ఆయుధాలు ఎత్తుకు పోతున్న ఘటనలతో అప్రమత్తమైన సైన్యం, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముందుకు కదిలినట్టు సమాచారం.

Related

  1. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ పాక్ రాయబారికి సమన్లు
  2. లోకేష్ మ‌ళ్లీ ఎక్క‌డ నోరు జారుతార‌నే విదేశీప‌ర్య‌ట‌న‌ నుంచి త‌ప్పించారంట‌
  3. ఉద్యోగుల‌కు 9నెల‌ల జీతంను ఆప‌ర్ చేస్తున్న సంస్థ‌
  4. లగడపాటి తాజా సర్వే.. 2019 లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు.. వైసీపీ ప్రభంజనం

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -