Sunday, May 19, 2024
- Advertisement -

లగడపాటి తాజా సర్వే.. 2019 లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు.. వైసీపీ ప్రభంజనం

- Advertisement -
lagadapti sarve tdp loss

స‌ర్వేల ల‌గ‌డ‌పాటి స‌ర్వేల రాజ‌గోపాల్ అంటె రెండు రాష్ట్రాల్లో తెలియ‌ని వారుండ‌రు. నిత్యం ఏదోఒక సంచ‌ల‌నంతో వార్త‌ల్లో ఉంటారు.ఇటీవ‌ల తాత్కాలిక స‌చివాల‌యంలో చంద్ర‌బాబును ల‌గ‌డ‌పాటి క‌ల‌వ‌డం రాజకీయాల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి ల‌గ‌డ‌పాటి పోటీ చేయ‌బోతున్నార‌ని అందుకే చంద్ర‌బాబును క‌లిశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ల్యాంకో ప‌వ‌ర్‌తో ఒప్పందాల కోసం చంద్ర‌బాబును క‌లిశార‌న్న మ‌రో కోణం కూడా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయనే అంశంమీద స‌ర్వే నిర్వ‌హించి ఆ రిపోర్టును చంద్ర‌బాబు నాయుడికి అంద‌జేసేందుకె వెల్లార‌ని మీడియా,సోషియ‌ల్ మీడియాలో ఆ వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

అయితే ఆరిపోర్ట్ ను చూసిన చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరిగే షాక్‌కు గుర‌య్యారంట‌.చంద్ర‌బాబు అనుకూల మీడియా వ‌ర్గం క‌థ‌నాల ప్ర‌కారం 2019 ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి స‌ర్వే ప్ర‌కారం టీడీపీకి దిమ్మ‌తిరిగే ప‌లితాలు రాబోతున్నాయ‌ని ..మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం అసాధ్య‌మ‌నే ప‌లితాలు వ‌చ్చాయంట‌.స‌ర్వే ప్ర‌కారం ప్ర‌స్తుం పార్టీకి ఉన్న 129 మంది ఎమ్మెల్యేల్లో 80 మందిపై పూర్తి వ్య‌తిరేక‌త ఉంద‌ని వారు ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని తేలిందంట‌.

అధికారంలోకి వ‌చ్చి మూడేల్లు అయ‌న సీఎంగా ఎంతో అనుభ‌వం ఉన్నా అవినీతి నియంత్ర‌ణ లేక‌పోవ‌డం, ఎన్నిక‌ల్లో 600 హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తారా స్థాయికి చేరిన‌ట్టు భావిస్తున్నారు. ప్ర‌ధానంగా ఏపీకీ ప్ర‌త్యేక హోదా,రైల్వేజోన్‌వంటి హీమీల‌ను తుంగ‌లోకి తొక్క‌డంతో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త తారాస్థాయి చేరింద‌ని స‌మాచారం. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న వైసీపీ ప‌ట్ల ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్నార‌ని….వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఎన‌భై శాతం సీట్లు ద‌క్కేలా ప్ర‌జ‌లు తీర్పు నిస్తార‌ని స‌ర్వేలో తేలింద‌ట‌.రుణ‌మాఫీని పూర్తిగా చేయ‌క‌పోవ‌డం, డ్రాక్రా సంఘాల‌కు ఒక్క రూపాయికూడా అంద‌క‌పోవ‌డంతో మ‌హిలల్లోకూడా వ్య‌తిరేక‌త ఎక్కువ‌గానే ఉంద‌ట‌. ఈస‌ర్వే వాస్త‌విక‌త‌కు అద్దం ప‌ట్టేవిధంగా ఉంద‌ని టీడీపీ సీనియ‌ర్లుకూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.ల‌గ‌డ‌పాటి స‌ర్వేలో టీడీపీకి చెందిన 65శాతం మంది ఎమ్మెల్యేలు ఓడిపోతార‌ని చెప్పిన విష‌యాన్ని టీడీపీ అనుకూల మీడియా సంస్థే ప్ర‌సారం చేయ‌డం టీడీపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

{youtube}-51ffvCScgg{/youtube}

Related

  1. టీడీపీ లో అవమానాలు తట్టుకోలేక సొంత‌గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు
  2. అమరావతి బరిలో వైసీపీ నుంచి స్టార్ హీరో.!
  3. 2019 క‌డ‌ప‌లో వైసీపీ క్లీన్ స్విప్‌ టీడీపీ గుండెల్లో అల‌జ‌డి
  4. ఏపీ రాజకీయాలో మరో సంచలనం.. వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -