Monday, April 29, 2024
- Advertisement -

జమ్మూ -కశ్మీర్​ మళ్లీ రాష్ట్రం కాబోతున్నదా?

- Advertisement -

జమ్మూ -కశ్మీర్​ కు ఉన్న ప్రత్యేక హోదాను కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. అప్పట్లో జమ్మూ -కశ్మీర్​ ను విభజించిన కేంద్రం .. జమ్మూ -కశ్మీర్​, లడఖ్​ గా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అయితే అప్పటినుంచి ఈ రెండు ప్రాంతాల్లో ఎన్నికలు జరగడం లేదు. చాలా రోజుల పాటు అక్కడ కఠిన ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే జమ్మూ -కశ్మీర్​ ను భవిష్యత్​లో రాష్ట్రం చేసే అవకాశం ఉందని అప్పట్లోనే కేంద్రం ఓ ప్రకటన చేసింది. తాజాగా ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. జమ్మూ -కశ్మీర్​ కు మళ్లీ రాష్ట్రం హోదా ఇచ్చి అక్కడ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అక్కడి రాజకీయపార్టీలతో చర్చలు జరపబోతున్నారట.

ఇప్పటికే అక్కడి రాజకీయ పార్టీలు జమ్మూ -కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూ -కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదా తొలగించడం పట్ల వారు మండిపడుతున్నారు. అక్కడ ఉన్న ఏడు పార్టీలు కలిసి గుప్కార్‌ కూటమిగా ఏర్పడి .. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ కూటమితో కేంద్రం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2018 జూన్‌లో మెహబూబా ముఫ్తీతో బీజేపీ పొత్తు విఫలమైంది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 2019 ఆగస్టులో జమ్మూ -కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక రాజ్యాంగ హోదాను తొలగించి, రాష్ట్రాన్ని కేంద్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ)గా మార్చింది. అప్పటినుంచి ఇప్పటిదాక అక్కడ ఎన్నికలు జరగడం లేదు. అయితే తాజాగా జమ్మూ -కశ్మీర్​ ను రాష్ట్రంగా మార్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read

పంజాబ్​లో కొత్త పొత్తు..! బీజేపీకి నష్టం తప్పదా?

బీజేపీకి సీన్​ రివర్స్​.. పార్టీ నుంచి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు ?

బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -