హీరో మంచు మనోజ్ చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ , అభిమానులకు మాత్రం ఎప్పుడు టచ్‌లోనే ఉంటున్నాడు. మనోజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికి తెలిసిందే. ఈ మధ్య సినిమాల గురించి కాకుండా సమాజంలో జరుగుతున్న వాటిపై ట్విట్ చేస్తున్నాడు మనోజ్. నిన్నటికి నిన్న కియా మోటర్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టడంపై ట్విట్ చేసి వెంటనే డిలీడ్ చేశాడు మనోజ్. ట్విట్ ఎందుకు డిలీట్ చేశావని నెటిజన్లు అడిగితే వారిని అసభ్యపదజాలంతో తిట్టి ట్రోల్స్‌ను ఫేస్ చేశాడు. తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పాడు మనోజ్.
ఈసారి ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశాడు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు… తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారు. ఇప్పటికి అయిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. లేకపోతే వెంకన్న ఆగ్రహానికి గురి కాక తప్పదని మనోజ్ తెలిపారు. చివరి బడ్జెట్‌లో కూడా ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మట్టికొట్టుకుపోతారని మనోజ్ చెప్పుకొచ్చారు. ఇప్పటికి చేసిన తప్పును గ్రహించి ఏపీకి మంచి చేయమని ఆయన ప్రధాన మంత్రిని కోరారు.
- ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ కానుక
- విజయ్ బాటలో చంద్రబాబు?
- ఆపరేషన్ తెలంగాణ…బీజేపీ ఫోకస్!
- బాలకృష్ణ NBK111.. సెట్ లోకి కాజల్ అగర్వాల్!
- గర్ల్‌ఫ్రెండ్ భర్తను చంపి.. ‘ప్రోగ్రామ్ ఓకే’ అని ప్రియుడి ఫోన్ కాల్..
