Friday, March 29, 2024
- Advertisement -

మసాలా గులాటీ ఇక లేరు..!

- Advertisement -

ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండీహెచ్‌ అధినేత, పద్మభూషణ్‌ గ్రహీత మహాశయ్‌ ధర్మపాల్‌ గులాటీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో దిల్లీలోని ఆసుపత్రిలో చేరిన ఆయన.. గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 98 సంవత్సరాలు.

1923లో పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన గులాటీ నాలుగో తరగతితోనే చదువు మానేశారు. ఉపాధి కోసం ఒకప్పుడు ఢిల్లీ రోడ్లపై గుర్రపు బండి నడిపిన ఆయన.. మసాలా సంస్థను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు.

తొలుత చిన్న బడ్డీకొట్టుతో మొదలైన ఆయన వ్యాపారం అనతి కాలంలోనే దిగ్గజ పరిశ్రమ స్థాయికి చేరుకుంది. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఏడాదికి రూ.900 కోట్ల టర్నోవర్‌తో విదేశాల్లోనూ ఆఫీసులు నిర్వహించే స్థాయికి చేరింది. అమెరికా, కెనడా, ఇంగ్లడ్‌, జపాన్‌, యూఏఈ, సౌదీఅరేబియా లాంటి ఎన్నో దేశాలకు ఎండీహెచ్‌ మసాలా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం ఎండీహెచ్ 62 రకాల మసాలాలను ఉత్పత్తి చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -