కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం తెర్నెకల్ గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రేవేటీకరణ చేయకూడదు అని కోటి సంతకల సేకరణ రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి.
ఈ కూటమి ప్రభుత్వం విద్య వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు..ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు..PPP విధానాన్ని రద్దు చేసేందుకే కోటిసంతకాల సేకరణ చేస్తున్నాము అని అన్నారు.
PPP విధానాన్ని రద్దు చేసేవరకు..వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది..అలాగే గ్రామంలో వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు అందరు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కోటి సంతకల సేకరణ చేయాలని తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి సమక్షంలో గ్రామ అనుబంధ విభాగల కమిటీ నియమించారు.
