Friday, March 29, 2024
- Advertisement -

జ‌గ‌న్ దెబ్బ‌కు టీడీపీ త‌రుపునుంచి పోటీ చేయాడానికే భ‌య‌ప‌డుతున్న నేత‌లు

- Advertisement -

వైసీపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతోంది. ఒకే సారి 175 అసెబ్లీ, 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించి జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూకుడు పెంచారు. అయితే టీడీపీ మాత్రం పూర్తి స్థాయిలో అబ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌లేని స్థితిలో వుంది. 40 సంవ‌త్సరాల అనుభ‌వం అని చెప్పుకొనే బాబుకు ఇప్పుడు అభ్య‌ర్ధుల విష‌యంలో ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. పార్టీలో అంత‌ర్గ‌త అధిప‌త్య‌పోరు తారాస్థాయికి చేరింది. ఇదలా ఉంటె పార్టీనుంచి టికెట్లు ద‌క్కించ‌కున్న నేత‌లు క‌నీసం నామినేష‌న్ వేయ‌కుండానె ప‌లాయ‌నం చిత్త‌గిస్తున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీనుంచి ఎమ్మెల్యే టికెట్ ద‌క్కినా ఓట‌మి భ‌యంతో ఫ్యాన్ కింద‌కు చేరుకున్నారు. ఒక వైపు టికెట్లు ద‌క్క‌క టీడీపీలో నానా అవ‌స్థ‌లు ప‌డుతుంటె టికెట్లు ద‌క్కిన వాళ్లు మాత్రం పోటీ చేయ‌కుండా పారిపోతున్నారు. నెల్లూరు ఎంపీగా ఆదాల ప్ర‌భాక‌ర్ వైసీపీ త‌రుపున పోటీ చేస్తున్నారు.

ఇక క‌ర్నూలు జిల్లాలో కూడా టీడీపీకి అలాంటి చేదు ఘ‌ట‌నే ఎదుర‌య్యింది. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర్ అజ్ణాతంలోకి వెళ్లారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచి టీడీపీలోకి ఫిరాయించారు. అప్ప‌టి నుంచి నియోజ‌క వ‌ర్గంలో ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేకత ఉంది. ఈ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వాన్నే ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొదట సరేనన్న బుడ్డా.. అనంతరం తన వైఖరిని మార్చుకున్నారు. జ‌గ‌న్ జిల్లా ప‌ర్య‌ట‌న రోజె టీడీపీ నేత‌ల‌కు అందుబాటులో లేకుండా పోయారు.

ప్ర‌స్తుతం టీడీపీ త‌రుపున పోటీ చేస్తె డిపాజిట్లు కూడా రావ‌ని తెలియ‌డంతో ఇప్పుడు ఆదాల బాట‌లోనె న‌డ‌వాల‌ని చూస్తున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పి సొంత గూటికి రావాల‌ని చూస్తున్నారు. సొంత పార్టీలోకి వ‌స్తె గౌర‌వంతోపాటు భ‌విష్య‌త్తులో ఎమ్మెల్సీ ఇచ్చినా స‌రేన‌ని శ్రేణుల‌కు సంకేతాలిచ్చారు. దీంతో హుటా హుటిన టీడీపీ బుడ్డాకు ప్ర‌త్యామ్నాయంగా మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప్ రెడ్డిని శ్రీశైలంనుంచి బ‌రిలోకి దింపుతోంది. క‌నీసం నామినేష‌న్ వేయ‌కుండా అభ్య‌ర్ధులు ప‌లాయ‌నం చిత్త‌గించ‌డం చూస్తే పార్టీకి ఇంత‌కంటె ఘోర‌మైన అవ‌మానం ఏముంటుంది…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -