Thursday, May 16, 2024
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో మోడీ పరాజయం తధ్యం .. ఇందిరాగాంధీ లాగానే అట్టర్ ప్లాప్ !

- Advertisement -
Narendra Modi copying Indira Gandhi

కొందరు నాయకులు దేనికైనా ఫిక్స్ అయితే అటువైపు పూర్తిగా వెళ్ళిపోతారు. మధ్యలో వెనక్కి రావడానికి – తీసుకున్న నిర్ణయం క్యాన్సిల్ చెయ్యడానికి కూడా వారు వెనకాడరు. ప్రస్తుత నరేంద్ర మోడీ – అప్పట్లో కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ లాంటివారిని చూస్తే అదే అనిపిస్తుంది. రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకొని ఒక్కసారిగా కిందకి పడింది ఇందిరా గాంధీ. 1971 ఎన్నికల్లో గరీబీ హఠావో అనే నినాదంతో ఇందిర పోటీచేసి.. అద్భుత విజయం సాధించారు.

ఆ ఏడాది డిసెంబర్ లో బంగ్లాదేశ్ యుద్ధంలో ఘన విజయం సాధించి పెట్టారని ప్రతిపక్ష పార్టీలు సైతం ఆమెను దుర్గాదేవిగా అభివర్ణించడం మొదలు పెట్టాయి. కానీ.. అప్పటికే ఆమెను ముప్పు తెలియకుండా చుట్టుముట్టింది.  ఇందిర ప్రభుత్వం తట్టెడు వాగ్దాలు ఇచ్చింది. అయితే.. అమలు చేసింది శూన్యం. 1973 నాటికి ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. విద్యార్థి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 1974లో పోఖ్రాన్ లో అణుపాటవ పరీక్షను భారత్ నిర్వహించింది. కానీ దిగరుతున్న ఇందిర ప్రతిష్ఠను ఆ పరీక్ష నిలువరించలేక పోయిం ది. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఇందిర.. 1977 మార్చిలో ఎన్నికలకు వెళ్లారు. ఒక్కతాటిపైకి వచ్చిన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దారుణ పరాజయాన్ని మిగిల్చింది.

ఇప్పుడు అదే పరిస్థితి మోడీ ఎదురుకునేలా ఉన్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  జాతీయవాదాన్ని-ధనిక వ్యతిరేకతను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడాన్ని ఈ విధంగా విశ్లేషిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి పేదల సంక్షేమ ప్రచారాన్ని మోడీ అందుకున్నారు. ఇటీవల సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కశ్మీర్ లో లక్షితదాడులు జరిపించారు. నాటినుంచి సరిహద్దులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలతో మారుమోగిపోతున్నది. ఆ తర్వాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ నిర్ణయం ప్రకటించారు. తన చర్యను వ్యతిరేకించేవారంతా నల్లధనానికి మద్దతు పలికేవారేనని ధనికులు ఇన్నాళ్లూ పేదలను దోచుకుంటున్నారని మోడీ పదేపదే చెప్తూ వస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయన్ మాటల్లో ప్రధాని తనకు తాను పేదల పాలిట దేవుడిగా ప్రకటించుకున్నారు. ఆయనను వ్యతిరేకించేవారంతా దెయ్యాలు అన్నట్టు పరిస్థితి తయారైంది. అయితే మోడీ నిర్ణయానికి రోడ్లమీద ఉన్న జనం మద్దతు ప్రకటిస్తున్నారని మహారాష్ట్ర గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు వ్యాపారులు సహా తన సంప్రదాయ మద్దతుదారుల నుంచి మోడీ వ్యతిరేకత ఎదుర్కొంటుండటం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -