Wednesday, May 22, 2024
- Advertisement -

చైనా తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డం…

- Advertisement -

భార‌త్‌,చైనా మ‌ధ్య డోక్లాం స‌మ‌స్య పూర్తిగా స‌ద్దుమ‌న‌గ‌లేదు. మోదీ బ్రిక్స్ స‌ద‌స్సుకు చైనా వెల్తున్న సంద‌ర్భంగా ఇరు దేశాల సైన్యాలు స‌రిహ‌ద్దునుంచి వెన‌క్కు వెల్లాయ‌నె సంకేతాలు వ‌చ్చాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చైనాలో బ్రిక్స్ దేశాల సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ స‌ద‌స్సు స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే ఈ స‌ద‌స్సులో పాకిస్థాన్ ఉగ్ర‌వాదం గురించి మాట్లాడ వ‌ద్ద‌ని భార‌త్‌కు సూచించింది.

అయితే భార‌త్ మాత్రం చైనాకు షాక్ ఇచ్చింది. చైనా తాటాకు చప్పుళ్ల‌కు భ‌య‌ప‌డ‌మ‌ని సంకేతాలు పంపింది. బ్రిక్స్‌ వేదికపై ఉగ్రవాదం, పాక్‌ గురించి మాట్లాడకూడదని చైనా సంకేతాలు పంపింది. అయితే గంటల వ్యవధిలో అందుకు స్పందించిన భారత్‌.. ప్రధాని మోదీ గట్టిగానే ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తారన్న సిగ్నల్స్‌ను బీజింగ్‌కు పంపింది.

బ్రిక్స్‌ సదస్సుల్లో భాగంగా సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్తాన్‌ గురించి మోదీ ప్రస్తావించే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. బ్రిక్స్‌ సమావేశానికి హాజరవుతున్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా సమావేశమవుతారా? లేదా? అన్న విషయంపై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -