Saturday, May 4, 2024
- Advertisement -

ఉత్త‌ర కొరియా మ‌రో దుందుడ‌కు చ‌ర్య‌…

- Advertisement -
North Korea Fires Missile…Lands in Sea Between Korea and Japan

అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా మరోసారి దుందుడుకు చర్యకు పాల్పడింది.తాజాగా సోమవారం మ‌రోసారి ఉత్తర కొరియా మరో బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించి అమెరికాతోపాటు దానిమిత్ర దేశాల‌కు చుక్కులు చూపిస్తోంది.

ఎన్ని సార్లు హెచ్చ‌రించినా కొరియామాత్రం వెన‌క్కు త‌గ్గ‌డంలేదు.అమెరికాతో యుద్ధం చేసేందుకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నామని చెబుతున్న ఉ.కొరియా తాజా చేప‌ట్టిన ప్రయోగం.. పొరుగు దేశాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
తాజాగా జపాన్‌ సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించారు. దాదాపు ఆరు నిమిషాల పాటు ఈ క్షిపణి పయనించిందని యూఎస్‌ పసిఫిక్‌ కమాండ్‌ తెలిపింది. కాగా.. ఉ.కొరియా తీరును జపాన్‌ తీవ్రంగా ఖండించింది. ఉ.కొరియాను నిలువరించేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తామని జపాన్‌ ప్రధాని షింజో అబే ప్రకటించారు. ‘అంతర్జాతీయ సంఘాలు ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఉ.కొరియా మాత్రం రెచ్చగొట్టే చర్యలు ఆపడం లేదు. ఇక సహించేది లేదు’ అని అబే మీడియాతో అన్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇటీవల జరిగిన జీ7 సదస్సులోనూ ఉ.కొరియా గురించి అమెరికా సహా పలు దేశాలు చర్చలు జరిపాయి. ఉ.కొరియాను అడ్డుకునేందుకు అమెరికా ఎలాంటి చర్యలు చేపట్టినా.. అందుకు తాము మద్దతిస్తామని జీ7 సదస్సు సందర్భంగా జపాన్‌ ప్రధాని చెప్పారు. మరోవైపు ఉ.కొరియా క్షిపణి ప్రయోగంపై అటు దక్షిణకొరియా కూడా అత్యవసర సమావేశం నిర్వహించింది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}2i8cUJ_mV34{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -