Saturday, May 4, 2024
- Advertisement -

వ‌రుస‌గా మ‌రోసారి నాలుగు క్షిప‌ణీ ప‌రీక్ష‌లు…

- Advertisement -
North Korea fires multiple surface-to-ship cruise missiles test fire 4 anti-ship missiles

పిచ్చోడి చేతిలో రాయిఉన్న‌ట్లు…ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ చేతిలో ఉన్న క్షిప‌నుల వ‌ల్ల అంత‌ర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.టు అగ్రరాజ్యం అమెరికానే కాదు యావత్ ప్రపంచాన్నీ భయపెడుతున్న ఉత్తర కొరియా మరోమారు క్షిపణి పరీక్షలు నిర్వహించింది.ఉత్తరకొరియాలోని తూర్పుతీరంలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైనిక వర్గాలు తెలిపాయి.

గురువారం ఉదయం ఉత్తరకొరియా తూర్పతీరం నుంచి కొన్ని గుర్తుతెలియని ఆయుధాలను పరీక్షించారు.ఇవి సుమారు 120 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాయని ఆయన చెప్పారు. ఇటువంటివి మొత్తం 4 క్షిపణులను పరీక్షించారు.
ఐక్యరాజ్యసమితి ఆంక్షలను – అమెరికా బెదిరింపులను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా ఈ పరీక్షలు నిర్వహించింది. భూమిపై నుంచి సముద్రంలోని నౌకలను ధ్వంసం చేయగల సామర్థ్యమున్న వీటిని అమెరికా నౌకలే లక్ష్యంగా ప్రయోగించినట్లు తెలుస్తోంది. గతనెల మొదట్లో అమెరికా లక్ష్యంగా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

మరోవైపు ఉత్తరకొరియాను బెదిరించేందుకు అమెరికా ఇప్పటికే థాడ్ మిస్సైల్ వ్యవస్థను దక్షిణ కొరియాకు చేర్చింది. అంతేకాకుండా – కార్ల్ విన్సన్ – రొనాల్డ్ రీగన్ యుద్ధనౌకలను కూడా ఉత్తరకొరియా సమీప సముద్ర జలాల్లోకి పంపి లంగరేయించింది. కానీ అమెరికా చర్యకు ఉత్తరకొరియా ఏమాత్రం బెదరలేదు. ఇప్పుడు తాజాగా చేసిన ఈ పరీక్షలు చూస్తుంటే కయ్యానికి నేను రెడీ అంటున్నట్లే ఉంది. గురువారం ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణులు ఆ దేశానికి సుమారు 120 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించాయి.
ఉత్తరకొరియా మరిన్ని రెచ్చగొట్టే చర్యలు చేపట్టే అవకాశం ఉండటంతో నిఘా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తెలిపారు. ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. ఉత్త‌ర కొరియా మ‌రో దుందుడ‌కు చ‌ర్య‌…
  2. ఉత్త‌ర‌కొరియాపై చ‌ర్య‌లు తీసుకొనేందుకు వెన‌కాడ‌బోమ‌న్న జీ-7దేశాల కూట‌మి
  3. వన్న క్రై మాల్‌వేర్ సైబ‌ర్ దాడి మూలాలు ఉత్త‌ర కొరియాలో ఉన్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేసిన సైబ‌ర్ నిపునులు
  4. వన్న క్రై మాల్‌వేర్ సైబ‌ర్ దాడి మూలాలు ఉత్త‌ర కొరియాలో ఉన్న‌ట్లు అనుమానం వ్య‌క్తం చేసిన సైబ‌ర్ నిపునులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -