Tuesday, April 30, 2024
- Advertisement -

జ‌గ‌న్ హ‌త్యాయ‌త్నం కేసులో చిక్కుల్లో ప‌డ్డ బాబు..

- Advertisement -

జ‌గ‌న్ హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లో బాబు ఇరుక్కున్నాడా…? 40 సంవ‌త్స‌రాల అనుభం ఉంది అని సొంత డ‌బ్బా కొట్టుకొనే చంద్ర‌బాబు ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డాడ‌..? హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే ప‌రిస్థితులు అవున‌నే అనిపిస్తున్నాయి. జ‌గ‌న్‌పై క‌త్తి దాడి జ‌రిగిన వెంట‌నే బాబు చేసిన వ్యాఖ్య‌లే ఇప్పుడు బాబు ఎసురు తెచ్చి పెట్టాయి.

జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న త‌ర్వాత కేసు ద‌ర్య‌ప్తు చేసేందుకు సిట్‌ను నియ‌మించింది ప్ర‌భుత్వం. అయితే సిట్‌పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ధ‌ర్డ్ పార్టీచేత విచార‌ణ జ‌రిపించాల‌ని హైకోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. జగన్, ప్రభుత్వం తరపున లాయర్ల వాదనలు విన్న న్యాయమూర్తి జగన్ పిటీషన్ పై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ చంద్రబాబు, ఏపి ప్రభుత్వం, సిట్ , కేంద్రప్రభుత్వం, విమానాశ్రయ ఉన్నతాధికారులు, సిఐఎస్ఎఫ్ లకు నోటీసులిచ్చింది.

ఇక్క‌డే 40 యిర్స్ బాబు ఇరుక్కున్నాడు. కోర్టు ఆదేశాల ప్రకారం సమాధానం ఇవ్వలంటే ఏమని సమాధానం ఇవ్వాన్నదే అసలైన సమస్య. హత్యాయత్నం జరిగిందని అంగీకరించాలా ? లేకపోతే జరిగిందంతా కేవలం డ్రామా అనే చెప్పాలో తెలీటం లేదు.

హత్యాయత్నం ఘటన జరిగిన గంటలోపే చంద్రబాబు మాట్లాడుతూ జగన్ పై జరిగిన దాడిని డ్రామాగా కొట్టి పారేశారు. జగన్ పై జరిగిన దాడి ఘటనను ఘటనగా చూడకుండా రాజకీయానికి తెరలేపింది చంద్రబాబే. దాంతోనే రాజకీయంగా పెద్ద దుమారం రేగి దేశవ్యాప్తంగా సంచలనమైంది.

వ్యక్తిగతం ఎలాగున్నా ఇపుడు కోర్టుకు ఏమని సమాధానం ఇవ్వాలి ? జరిగిన దాడి కేవలం డ్రామా అని అంటే అందుకు తగ్గ ఆధారాలు చూపించాలి. లేదూ జరిగింది హత్యాయత్నమే అని ఒప్పుకుంటే అప్పట్లో చేసిన ప్రకటనకు సమాధానమిచ్చుకోవాలి. అదే సమయంలో జగన్ డిమాండ్ మేరకు థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు ఒప్పుకోవటం లేదో సమాధానం చెప్పుకోవాలి. ఏం చెప్పాలో తెలియ బాబు కొట్టుమిట్టాడుతున్నాడు.

ఒకసారంటూ కోర్టుకు సమాధానమిస్తే అందుకు కట్టుబడుండాల్సిందే. అందుకనే ఏమని సమాధానం ఇవ్వాలో తేల్చుకోలేక అవస్తలు పడుతున్నారు. సోమవారం లోగా సమాధానం ఇవ్వాలని తాజాగా ఆదేశిస్తూ విచారణను కూడా సోమవారానికి వాయిదా వేసింది. అన్ని వ్య‌వ‌స్థ‌ల్ని మ్యానేజ్ చేసే బాబు ఈకేసు ఒక లెక్కా అంటూ రాజ‌కీయ విశ్లేకులు అంటున్నారు. వారు అనింది నిజ‌మే క‌దా….!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -