Saturday, May 18, 2024
- Advertisement -

నింగికెగ‌సిన మ‌రో సాహితీ కెర‌టం….

- Advertisement -
Papular telugu poet c.narayanareddy passed away

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూసినారె(86) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

తెలుగు చలన చిత్ర రంగంలో సినారె పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినారె రాసిన పాటలు ఇప్పటికీ జనాలనోళ్లలో నానుతున్నాయి. ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’, ‘అరుంధతి’ సినిమాలో ‘జేజమ్మా జేజమ్మా’ వంటి పాటలు సగటు ప్రేక్షకుడి మదిని దోచుకున్నాయి. సినారె సాహితీ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 1997లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేసింది.

{loadmodule mod_custom,Side Ad 1}

కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో 1931 జులై 29న జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్రలు వదిలివెళ్లారు. 1953లో ‘నవమి పువ్వు పేరుతు’ సినారె తొలి రచన. 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారం అందుకున్నారు. 1977లో పద్మశ్రీ పురస్కారం వరించింది.
వీధిబడిలో విద్యనభ్యసించిన సినారె బాల్యంలోనే హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితులయ్యారు. సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్‌లో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. అనంతరం హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చేశారు. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు.

{loadmodule mod_custom,Side Ad 2}

కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్రలు వదిలివెళ్లారు. నారాయణరెడ్డి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Also read

  1. విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్న ఖైదీలు….
  2. సిరియా అంత‌ర్ యుద్ధంలో మ‌ర‌ణాన్ని జ‌యించిన బుడుత‌
  3. నాగ్ గీతాంజలి నటించిన హీరోయిన్ ఎక్కడుందో తెలుసా..?
  4. బహుముఖ ప్రజ్ఞాపాటవా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -