Tuesday, April 23, 2024
- Advertisement -

విలాస‌వంత‌మైన జీవితం గ‌డుపుతున్న ఖైదీలు….

- Advertisement -
The Norwegian prison where inmates are treated like prisoners

సాదార‌నంగా జైల్లో ఖైదీలకు అంత స్వేచ్చ ఉండ‌దు.ఆహారం కూడా అక్క‌డ వండింది తినాల్సిందే.ఏసీలు,టీవీలు ఇలా విలాసంవంత‌మైన జీవితం ఉండ‌దు.కాని ఆ దీవిలో మాత్రం ఆక్క‌డి ఖైదీల‌కు అన్ని సౌక‌ర్యాలు ఉంటాయి.విలాస‌వంత‌మైన జీవితం అక్క‌డి ఖైదీల సొంతం.

అక్కడికి వెళ్తే చుట్టూ నీరు.. ఎటూ చూసినా పచ్చని పొలాలు.. కలపతో చేసిన కాటేజీలు.. వాటిలో టీవీలు.. ఏసీలు.. ఎలాంటి వస్తువులైనా దొరికే సూపర్‌మార్కెట్‌లు కనిపిస్తాయి. అంతేకాదు.. అక్కడ నచ్చిన ఆహారాన్ని స్వయంగా వండుకోవచ్చు. బోర్‌కొడితే.. సినిమాలు చూడొచ్చు. సరదాగా గుర్రపు స్వారీ చేయొచ్చు. ఇదంతా చెబుతుంటే ఏ పర్యాటక ప్రాంతం గురించో అనిపిస్తుంది కదూ! కానీ.. ఈ సౌకర్యాలన్నీ ఓ జైలులో ఉన్నాయి.

{loadmodule mod_custom,GA1}

నార్వే ప్రభుత్వం 1898లో బస్టొయ్‌ ఐలాండ్‌ను కొనుగోలు చేసింది. దీన్ని1982లో జైలుగా మార్చింది. అయితే ఇది అన్ని జైళ్లలా కాదు. ఇక్కడ ఖైదీలు స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ప్రతీ ఖైదీకి ప్రత్యేక కాటేజీలుంటాయి. అందరికి భోజనం పెట్టడం కోసం ప్రత్యేకంగా వంటవాడు ఉంటాడు. ఒకవేళ ఆ వంట నచ్చకపోతే.. స్థానికంగా ఉన్న సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకొని స్వయంగా వండుకొని తినొచ్చు. వస్తువులు కొనడానికి డబ్బులు ఎలా అంటారా? అక్కడ ఖైదీలను ప్రభుత్వం నెలకు 90 డాలర్లు అలవెన్స్‌ కింద ఇస్తుంది.
వ్యవసాయం.. గుర్రాలకు కాపలా.. వాహనాలకు మరమ్మతులు చేయడం.. కలపతో వస్తువులు తయారు చేయడం.. ఐలాండ్‌ నిర్వహణలో సహాయపడటం ఇలా ఖైదీలు వారిని నచ్చిన పనిని ఎంపిక చేసుకొని విధులు నిర్వర్తించుకోవచ్చు. అందుకుగానూ వారికి రోజుకూ 8 డాలర్లు వేతనం లభిస్తుంది. అంతేనా.. ఖాళీ సమయాల్లో టీవీలో సినిమాలు చూసుకోవచ్చు.. గుర్రపు స్వారీ చేయొచ్చు.. టెన్నిస్‌ ఆడుకోవచ్చు.. చేపలు పట్టొచ్చు.

{loadmodule mod_custom,GA2}

2.6చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ జైలులో కేవలం 69 మంది పోలీసులు మాత్రమే ఉంటారు.రాత్రిపూట కేవలం ఐదారుగురు మాత్రమే గస్తీ కాస్తారు. అయినా.. ఒక్క ఖైదీ కూడా పోలీసుల కళ్లుగప్పి బయటపడాలనుకోరు. దీంతో భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు. అందుకే అతి తక్కువ భద్రతా సిబ్బంది ఉన్న జైలుగా దీనికి పేరుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}FtiyJeCIS_M{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -