- Advertisement -

మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు

- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో సంచలనం సృష్టించిన ఘటనలో, మహల్ రోజా మఠానికి చెందిన స్వయం ప్రకటిత దేవుడు మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు నమోదు అయింది. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల నేపథ్యంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు షహపూర్ తాలూకా గోగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

అందుబాటులోకి వచ్చిన సమాచారం ప్రకారం, చిన్నారితో అనుచితంగా ప్రవర్తిస్తూ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలు బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తానే దేవుడినని ప్రకటించుకుంటూ భక్తుల విశ్వాసాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలికకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. సంబంధిత మఠం కార్యకలాపాలపై కూడా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇటువంటి వీడియోలను షేర్ చేయకుండా, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -