- Advertisement -

జనసేన ఇంచార్జిపై మహిళ ఫిర్యాదు

- Advertisement -

జనసేన పార్టీకి చెందిన నేత సూర్యచంద్ర తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. అంతేకాదు, తన భర్తను చంపుతానని బెదిరించి తనకు బలవంతంగా విడాకులు ఇప్పించి కాపురాన్ని పాడుచేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఇటీవల 17వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సూర్యచంద్ర మద్యం మత్తులో ఇంటికి వచ్చి తనను తీవ్రంగా టార్చర్ చేశాడని బాధితురాలు తెలిపింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులపై కర్రతో ఇష్టానుసారంగా దాడి చేశాడని, వారిని తీవ్రంగా గాయపరిచాడని ఆరోపించింది. ఈ ఘటనతో తన కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైందని, తమకు ప్రాణహాని ఉందని ఆమె పేర్కొంది.

సూర్యచంద్ర నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు బెదిరింపులు వస్తున్నాయని, ఈ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని బాధిత మహిళ తెలిపింది. తనకు న్యాయం చేయాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. బాధితురాలి ఆరోపణలపై సూర్యచంద్ర స్పందన ఇంకా రాలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -