Tuesday, May 14, 2024
- Advertisement -

అర్ద‌రాత్రి ప్ర‌ముఖ పారీశ్రామిక వేత్త జిపి రెడ్డి ఇంట్లో సోదాలు అడ్డుకున్న ల‌గ‌డ‌పాటి

- Advertisement -

హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారి జీపీ రెడ్డి ఇంట్లో నిన్న అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించడం క‌ల‌క‌లం రేపింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.65లోని ఆయన నివాసంలో అర్థరాత్రి వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సోదాల‌పై ఆయన కుమార్తె శైలజ స్పందించారు. ఏడాదిన్నర కాలంగా పోలీస్ ఉన్నతాధికారి నాగిరెడ్డి తన తండ్రిని వేధిస్తున్నాడని శైలజ తెలిపారు.

నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఎలాంటి వారెంట్ లేకుండా తమ ఇంటిలోకి అధికారులు చోరబడ్డారని వెల్లడించారు. వారెంట్ పై ప్రశ్నిస్తే.. ‘వారెంట్ లేదు.. గీరెంట్ లేదు.. మీ డాడీని స్టేషన్ కు తీసుకుపోతున్నాం’ అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

సివిల్ కేసుకు సంబంధించిన విచారణంటూ పోలీసులు హల్‌చల్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ చూపించకుండా ఇంట్లోకి వచ్చారు. మరోవైపు జీపీ రెడ్డి ఇంట్లో తనిఖీల విషయం తెలుసుకున్న ఆయన మిత్రుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

సెర్చ్ వారెంట్ లేకుండానే తన మిత్రుడిని ఇబ్బంది పెడుతున్నారంటూ అభ్యంతరం తెలిపారు. ఐపీఎస్ అధికారి నాగిరెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. పాత కేసును పట్టుకుని అర్థరాత్రి వేళ పోలీసులు హడావిడి చేశారంటూ ధ్వజమెత్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -