Monday, April 29, 2024
- Advertisement -

జైస్వాల్ డబుల్ సెంచరీ..ఇంగ్లాండ్‌కు భారీ టార్గెట్

- Advertisement -

రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా భారీ టార్గెట్‌ను ఇంగ్లాండ్ ముందుంచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు రాణించడంతో భారీ స్కోరు సాధించి డీక్లేర్ చేసింది రోహిత్ సేన. ముఖ్యంగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మూడో రోజు ఆటలో సెంచరీ చేసిన యశస్వీ…నాలుగో రోజు అదే జోరు కంటిన్యూ చేశాడు.

235 బంతుల్లో 14 పోర్లు, 12 సిక్సర్లతో 213 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జైస్వాల్ కెరీర్‌లో ఇది రెండో డబుల్ సెంచరీ. శుభ్ మన్ గిల్ 91 పరుగులు చేయగా సర్ఫరాజ్ ఖాన్ ఆరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు బ్యాక్ టూ బ్యాక్ హాఫ్ సెంచరీలతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన సర్ఫరాజ్..రెండో ఇన్నింగ్స్‌లో 67 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ఇక 430/4 వ‌ద్ద‌ టీమిండియా ఇన్నింగ్స్‌ను డీక్లేర్ చేయగా ఇంగ్లండ్‌కు 557 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -