- Advertisement -
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 24 నాటికి వాయుగుండంగా మారుతుందని, ఆ తర్వాత నవంబర్ 26 నాటికి తుఫానుగా (Cyclonic Storm) బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నేటి (నవంబర్ 21) నుంచి వారం రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని… తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. నవంబర్ 26వ తేదీ నుండి ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీరంపై మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.
