Saturday, May 4, 2024
- Advertisement -

వ‌ర్మ‌చుట్టూ బిగిస్తున్న ఉచ్చు… ప్రాథ‌మిక విచార‌ణ‌పూర్తి, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫోన్ స్వాధీనం..

- Advertisement -

ఇటీవల వివాదాస్పద గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌ (జీఎస్టీ) అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మను సీసీఎస్‌ పోలీసులు శనివారం మూడుగంటపాలు విచారించారు. జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవితోపాటు ఇత‌ర మ‌హిళా సంఘాల‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్‌ పోలీసులు విచారించారు. వర్మను 25 నుంచి 30 ప్రశ్నలు అడిగిన పోలీసులు ల్యాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్‌ను సీజ్‌ చేశార‌కు. మ‌రో సారి విచార‌ణ‌కుహాజ‌రుకావాల‌ని పోలీసులు నోటీసులిచ్చారు.

160 నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచిన పోలీసులు, రెండు సార్లు స్కిప్ చేసి ఇవాళ విచారణకు హాజరైన వర్మ తన లాయర్ తోపాటు విచారణకు హాజరు తాజాగా 41నోటీసు ఇవాళ ఇచ్చి పంపిన పోలీసులు..

సామాజిక కార్యకర్త దేవి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఎఫ్.ఐ.ఆర్ నమోదు, విచారణ ఫిర్యాదులో ఆడవాళ్లను అసభ్యకరంగా చిత్రీకరించారని, జీఎస్టీ ఆర్ట్ అంటూ తన అభిప్రాయాలు చెప్తుంటే కించచపరిచారని వర్మపై దేవి ఫిర్యాదు.

వర్మ జీఎస్టీ భారత దేశంలోని చట్ట ప్రకారం అబ్సీన్ అంటున్న పోలీసులు. మహిళల దుర్వినియోగం, ఆడవాళ్లను కించపరిచినట్లుగా కేసు నమోదు చేశామన్న పోలీసులు జీఎస్టీని ఆన్ లైన్ లో డైరెక్ట్ చేశానన్న వర్మ… ఫోటోల్లో వున్నాడని అడగ్గా… పోలండ్ లో వేరే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లానన్నారు. సినిమా తీసిందంతా అమెరికన్ కంపెనీ అన్న వర్మ… తనకు ఏమీ పారితోషికం ఇవ్వలేదన్నారు.

అంతే కాక వర్మ గతంలో… జాతీయ చిహ్నంలోని స్లోగన్ మార్చి సత్యమేయ జయతే అని రాసిన నేపథ్యంలో… దానిపైనా విచారణ ఇక ఓ ఏడాది, రెండేళ్లు శిక్ష పడ్డ కేసులున్నాయి.

జీఎస్టీని స్కైప్ లో డైరెక్ట్ చేశానన్నారు. అతని లాప్ టాప్ సీజ్ చేశాం. ఫోరెన్సిక్ పంపి రిపోర్ట్ వచ్చాక.. మళ్లీ విచారిస్తాం అని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -