Tuesday, May 14, 2024
- Advertisement -

భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై అనుచ‌రుల‌తో స‌మావేశ మ‌వ‌నున్న రామ‌సుబ్బారెడ్డి

- Advertisement -
Rama Subba Reddy may quit TDP and join YSRCP..?

క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్‌కు చెక్ పెట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న సీఎం చంద్ర‌బాబుకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న ప్రోత్స‌హించిన‌ పిరాయింపులే ఇప్పుడు కొంప‌ముంచుతున్నాయి.

పార్టీ కోసం మొద‌టినుంచి ప‌నిచేస్తున్న వారి మాట‌ల‌ను లేక్క‌చేకుండా తాత్కాలిక లాభం కోసం బ‌ద్ద‌శ‌త్రువుల‌ను పార్టీలోకి చేర్చుకుంటున్నారు.అయితే పైకి క‌ల‌సే ఉన్నా వారి నియేజ‌క వ‌ర్గాల్లో మాత్రం ప‌చ్చ‌గ‌డ్డివేస్తే బ‌గ్గుమంటుంది.
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టిడిపి సీనియ‌ర్ నాయకుడు మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి పార్టీ అధినేత‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.త‌న బ‌ద్ద‌శ‌త్రువైన ఆదినారాయ‌ణ‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవ‌ద్దంటూ రామ‌సుబ్బారెడ్డి చేసిన విజ్ణ‌ప్తిని బాబు ప‌ట్టించుకోలేదు.దీంతో గ‌త కొంత‌కాలంగా బాబుపై గుర్రుగా ఉన్నారు.విశాఖ‌లో జ‌రుగుతున్న మ‌హానాడుకు రామ‌సుబ్బారెడ్డి డుమ్మా కొట్ట‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు చాలా కాలంగా కొనసాగుతోంది. ఆదినారాయణరెడ్డి తండ్రి కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే, రామసుబ్బారెడ్డి బాబాయి టిడిపిలో కొనసాగారు. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన టిడిపిలో చేరారు.బాబు ఇద్ద‌రికి ఎంత స‌ర్దిచెప్పినా ప‌లితం క‌నిపిండంలేదు.
పార్టీలోకి ఆదినార‌య‌ణ‌రెడ్డిన రాకుండా ఉండేందుకు రామ‌సుబ్బారెడ్డి చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి.మ‌రోవైపు మంత్రి ప‌ద‌వి రాకుండా చ‌వరి వ‌ర‌కు ప్ర‌య‌త్నం చేశారు.కాని కుద‌ర‌లేదు.పార్టీలో అసంతృప్తితో ఉన్నారు.
విశాఖ‌లో జ‌రుగుతున్న మ‌హానాడుకు రామ‌సుబ్బారెడ్డి దూరంగా ఉంటున్నారు.ప్ర‌త్య‌ర్థిని పార్టీలోకి తీసుకోవ‌డ‌మే కాకుండా మంత్రిప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంతో ర‌గిలిపోతున్నారు.జిల్లాకు చెందిన కొంద‌రి నాయ‌కుల తీరు వ‌ల్లే ఆయ‌న మాహానుడుకు దూరంగా ఉంటున్నార‌ని ఆయ‌న అనుచ‌ల చెప్తున్నారు. విశాఖఫట్టణంలో జరిగిన మహానాడు తొలిరోజు సమావేశం ముగిసిన తర్వాత నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని తీర్మాణం చేశారు.గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీని చేయాల‌ని నిర్న‌యించారు.
పార్టీ తీరుపట్ల కోపంతో ఉన్న ఆయన అనుచరులతో ఆదివారం నాడు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.అయితే ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్న‌యం తీసుకున్న త‌ర్వాత కూడా త‌న అనుచ‌రుల‌తో తీసుకున్న నిర్న‌యం ఇప్పుడు రాజ‌కీయాల్లో వైర‌ల్‌గా మారింది.

{loadmodule mod_custom,Side Ad 2}

రామసుబ్బారెడ్డి త‌న అనుచరులతో సమావేశం త‌ర్వాత భవిష్యత్ కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తితో ఆయన పార్టీని వీడుతారనే ప్రచారం కూడ గతంలో జోరుగా సాగింది.ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇచ్చిన తర్వాత ఏర్పాటుచేసిన పార్టీ సమావేశానికి హజరైన ఎంపీ సిఎం రమేష్ పై రామసుబ్బారెడ్డి అనుచరులు దాడికి దిగారు.
ఇంత‌కాలం మౌనంగా ఉన్న రామ‌సుబ్బారెడ్డి ఇప్పుడే ఏదోక నిర్న‌యం తీసుకోక‌పోతే భ‌విష్య‌త్తు ఉండ‌ద‌నే త‌న అను అనుచ‌రుల‌తో స‌మావేశం అయ్యారు.పార్టీ సమావేశానికి హజరైన ఎంపీ సిఎం రమేష్ పై రామ‌సుబ్బారెడ్డి అనుచ‌రులు దాడికి దిగ‌డం చూస్తె అధిష్టానంపై ఎంత‌కోపంగా ఉన్నారో అర్థ‌మ‌వుతోంది.అయితే తాజాగా రామసుబ్బారెడ్డి అనుచరులతో సమావేశం కావడం రాజకీయంగా సంచలనం కల్గిస్తోంది. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ప్ర‌త్యామ్నాయం వైసీపీ త‌ప్ప వేరే మార్గం లేదు.అందుకే ఆయ‌న పార్టీ మారే యేజ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -