Wednesday, May 15, 2024
- Advertisement -

పిరాయింపు ఎమ్మెల్యేల‌కు ఇక చుక్క‌లే..

- Advertisement -
AP CM Chandrababu Naidu Shock to YSRCP Jumped MLA’s

వైసీపీ గుర్తు మీద గెలిచి తాత్కాలిక తాయిలాల‌కు ఆశ‌ప‌డి టీడీపీలోకి వెల్లిన పిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది. వ‌చ్చేఎన్నిక‌ల్లో త‌మ భ‌విష్య‌త్తు ఏంట‌నే బెంగ ఇప్పుడే మొద‌ల‌య్యింది.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రిప‌దువులు రాని వాల్ల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఇన్నాల్లు ఆశ‌ప‌డ్డ వాల్ల‌కు ఇప్పుడు నిరాశే మిగిలింది.
సీఎం చంద్ర‌బాబు నాయుడు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు డ‌బ్బు,ప‌ద‌వులుతో పాటు ప్ర‌లోభ పెట్టి పిరాయింపుల‌ను సిగ్గులేకుండా ప్రోత్స‌హించార‌నేద వాస్త‌వం. అయితే వారికి ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో 175 నుంచి 225 సీట్లు పెరుగుతాయ కాబ‌ట్టి వారి సీట్లు వారికే కేటాయిస్తాన‌ని ఆశ చూపారు.కాని ఇప్పుడది అడ్డం తిరుగుతోంది.2019 ఎన్నిక‌ల‌కు అసెంబ్లీ సీట్లు పెంచేది లేద‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డంతో పిరాయింపు ఎమ్మెల్యేలలో వ‌ణుకు మొద‌ల‌య్యింది.

{loadmodule mod_custom,Side Ad 1}

వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు పెంపులేక‌పోయినా అన్ని సీట్లు గెల‌వాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు చంద్ర‌బాబు.దీంతో ఇప్పుడు ఏంచేయాల‌ని పిరాయింపు ఎమ్మెల్యేల‌లో చ‌ర్చ మొద‌లైన‌ట్లు స‌మాచారం.సీట్లు పెరిగితే ఇబ్బంది ఉండ‌దు….పెర‌గ‌పోతే తమ భ‌విష్య‌త్తు ఏంట‌నే ఆందోళ‌న‌లో ఉన్నారు.
ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నామినేటెడ్ పోస్ట్‌లు ఇచ్చేది ఏద‌ని బాబు తేల్చిచెప్పారు. మ‌రో వైపు టీడీపీ మీద ప్ర‌జ‌ల‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది.దీంతో పిరాయింపు ఎమ్మెల్యేలు దిక్కుతోచ‌ని స్తితిలో ప‌డ్డారు.ఒక వేల టికెట్టు వ‌చ్చినా ప్ర‌జ‌ల‌ల్లో ఉన్న‌వ్య‌తిరేక‌తను అధిగ‌మించ‌డ క‌స్టంతో కూడుకున్న ప‌ని.దీంతో పిరాయింపు ఎమ్మెల్యేల ప‌రిస్థితి ముందునుయ్యి..వెనుక గొయ్యిలాగా తయార‌య్యింది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}HuzUycBNERo{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -