Sunday, May 19, 2024
- Advertisement -

రెండు పెద్ద టెలికం కంపెనీల మ‌ధ్య మొద‌ల‌యిన టారిఫ్‌ల వార్‌

- Advertisement -
Reliance gio betwee Air tel to again tarif war

టెలికాం మార్కెట్లో కంపెనీల మ‌ధ్య మ‌రో పోరు మొద‌ల‌యింది. టెల‌కంరంగంలోకి కొత్త ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో …. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మధ్య మరోసారి వార్ మొద‌ల‌య్యింది. ఇప్పుడు మొద‌ల‌య్యింది టారిప్ వార్‌.

జియోకు తరలిపోకుండా కస్టమర్లను కాపాడుకోవడానికి తీసుకొస్తున్న ఆఫర్లను రహస్యంగా ఉంచనున్నట్టు ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ చెబుతుండగా.. ప్లాన్స్ ను ఓ కామన్ ప్లాట్ ఫామ్ పైకి తీసుకురావాలని జియో డిమాండ్ చేస్తోంది. ప్లాన్స్ ను బహిర్గతం చేసే విషయంలో టెలికాం దిగ్గజాలు, జియోల పోరు ఉధృతమవుతోంది.
టారిఫ్ అసెస్ మెంట్ పై టెలికాం రెగ్యులేటరీ మంగళవారం కంపెనీలకు ఓపెన్ హౌజ్ చర్చ నిర్వహించింది. కస్టమర్లను కాపాడుకోవడానికి ఆఫర్ చేసే డిస్కౌంట్లు, ప్లాన్స్ అనియతగా కాకుండా.. ఒక్కో యూజర్ సగటు ఆదాయం, కస్టమర్ విధేయత వంటివాటికి అనుగుణంగా ఉండాలని ట్రాయ్ చెబుతోంది. మరో 30రోజుల్లో వీటికి సంబంధించి ఓ గైడ్ లైన్సును ట్రాయ్ జారీచేయనుంది.

{loadmodule mod_custom,Side Ad 1}
ఎప్పుడైతే కస్టమర్ తమ నెట్ వర్క్ ను వదలివెళ్లాలనుకున్నప్పుడు, వారిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఆపరేటర్ పై ఉంటుందని భారతీ ఎయిర్ టెల్ రెగ్యులేటరీ అధినేత అన్షుమన్ థాకూర్ చెప్పారు.అయితే దీన్ని మాత్రం రిలయన్స్ జియో పూర్తిగా విభేదిస్తోంది. పారదర్శకత కోసం ప్రస్తుతమున్న చర్యలు సరిపోవని, పారదర్శకత స్పెషిఫికేషన్స్ స్థిరంగా లేవని జియో పేర్కొంటోంది. టెల్కోలు ఆఫర్ చేసే అన్ని ప్లాన్స్ ను కామన్ ప్లాట్ ఫామ్ లో ప్రచురించాలని తాము కోరుతున్నామని, వాటిని చూసి తమకు బెస్ట్ అనిపించిన వాటిని కస్టమర్లకు ఎంపికచేసుకునే అవకాశం కల్పించాలని అంటోంది.

{loadmodule mod_custom,Side Ad 2}

Related

  1. నేటి నుంచే ఎస్‌బీఐ అద‌న‌పు ఛార్జీల బాదుడు సురూ
  2. బ్రాడ్ బ్రాండ్ సేవ‌ల రంగంలోకి రిల‌య‌న్స్ జియో
  3. ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌న‌పు డేటానుప్ర‌యేజ‌నాలు
  4. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ఫోన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -