Sunday, May 5, 2024
- Advertisement -

బ్రాడ్ బ్రాండ్ సేవ‌ల రంగంలోకి రిల‌య‌న్స్ జియో

- Advertisement -
Reliance Jio launch broadband with 100Mbps speed in by Diwali

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఓ సంచలనం. ఆరంభంతోనే విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. ముఖ్యంగా మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను అతి చౌకగా, ఇతర టెలికాం సంస్థలకు దీటుగా అందించింది. ఇప్పుడు మరో సంచలనానికి జియో తెరతీయనుందని వ్యాపార వర్గాల సమాచారం.

హోమ్‌ బ్రాడ్‌బాండ్‌ సేవలను రిలయన్స్‌ జియో ప్రారంభించనుంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది.
మొబైల్‌ ఇంటర్నెట్‌ మాదిరిగానే హోమ్‌ బ్రాండ్‌బాండ్‌ సేవలను కూడా అతి చౌకగా వినియోగదారులకు అందించాలని రిలయన్స్‌ యోచిస్తోందట. అతితక్కువగా రూ.500లకు 100 జీబీ డేటాను జియో ఇవ్వనుందని సమాచారం. తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం వచ్చే నెలలో జియో ఫైబర్‌కు సంబంధించిన వివరాలను రిలయన్స్‌ వెల్లడించే అవకాశం ఉంది.

{loadmodule mod_custom,Side Ad 1}
మొద‌ట ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్‌, అహ్మదాబాద్‌, జమ్‌నగర్‌, సూరత్‌, వడోదర వంటి ఎంపిక చేసిన నగరాల్లో హోమ్‌ బ్రాండ్‌బాండ్‌ సేవలను పరీక్షిస్తున్నట్లు ఈ నెలలో జియో ట్వీట్‌ చేసింది. పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను జియో విస్తరించనుంది. ప్రారంభ ఆఫర్‌ కింద ఏకంగా 100 ఎంబీపీఎస్‌ వేగంతో హోమ్‌ బ్రాడ్‌బాండ్‌ సేవలు ఉండనున్నాయి. అదీ కూడా చౌకగా వినియోగదారులకు అందించే అవకాశం ఉంది.
రిలయన్స్‌ జియోతో మొబైల్‌ సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. ఇక హోమ్‌ బ్రాండ్‌బాండ్‌ సేవలను జియో తీసుకురానుండటంతో ఈ రంగంలో కూడా ఇతర పోటీ సంస్థలకు ఒత్తిడి తప్పదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇతర నెట్‌వర్క్‌లూ ధరలు తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

Related

  1. ప్లిఫ్ కార్టులో బంప‌ర్ సేల్స్
  2. ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు మూరు బంప‌ర్ ఆప‌ర్‌ల‌ను తీసుకొచ్చి వొడాఫోన్
  3. ఎయిర్‌ టెల్‌ బ్రాండ్‌ బ్యాండ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అద‌న‌పు డేటానుప్ర‌యేజ‌నాలు
  4. డిపాజిట్ల‌పై క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన పేటీఎమ్ పేవ్‌మెంట్ బ్యాంక్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -