Thursday, May 16, 2024
- Advertisement -

అందరూ ఎదురు చూపులు.. ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ ఇదే..!

- Advertisement -

తెలంగాణలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జులై 5 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌, జులై 1న ఈసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్‌ 20న పీజీఈసెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన ఉన్నత విద్యామండలి.. ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్‌, లాసెట్‌, పీజీలాసెట్‌ తేదీలపై నిర్ణయం తీసుకోలేదు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఎంసెట్‌ను జులైలో నిర్వహించాలని నిర్ణయించింది. 

ఎంసెట్​లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 70 శాతం.. మొదటి సంవత్సరంలో పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే నిర్ణయించింది. జేఈఈ తరహాలోనే ఈ ఏడాది ఎంసెట్​లో ఛాయిస్ ఇవ్వనున్నారు. ఎన్ని ప్రశ్నలు అదనంగా ఇవ్వాలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ యథాతథంగా కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఐసెట్‌ కన్వీనర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ రాజిరెడ్డిని నియమించారు. మిగిలిన పరీక్షల తేదీలు త్వరలో విడుదల చేయనున్నారు.

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్

వైఎస్ ష‌ర్మిల చేతుల మీదుగా ఏమిటో ఏమిటో!?

నిమ్మగడ్డ పాచిక పారలేదు.. వాళ్లే స‌ర్పంచుల‌ని చెప్పాలా బాబు!

ఘాటైన మిరియాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -