Saturday, May 4, 2024
- Advertisement -

వాజ్ పేయి అంత్యక్రియలు ముగియగానే కేరళకు మోదీ

- Advertisement -

భారీ వర్షాలతో అట్టుడుకుతున్న కేరళలో పర్యటించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా తిలకించి, సమీక్ష జరిపేందుకు తాను కేరళ వెళ్లనున్నట్టు ప్రధాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సాయంత్రం వాజ్ పేయి అంత్యక్రియల అనంతరం కేరళ చేరుకోనున్న మోదీ, రేపు ఏరియల్ సర్వే చేయనున్నారు.

కేరళలో గత 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జలాశయాలూ నిండుకుండల్లా మారాయి. జలాశయాల నుంచి దిగువస్తున్న వరద నీటితో 13 జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కోచి విమానాశ్రయాన్ని శనివారం వరకూ మూసివేశారంటే పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సుమారు 1.67 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికోసం కేరళ వ్యాప్తంగా 1,165 సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటుచేశారు. కోచితోపాటు కేరళలోని అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -