Sunday, April 28, 2024
- Advertisement -

100 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్!

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది మోడీ నేతృత్వంలోనే బీజేపీ దూకుడు పెంచింది. ఈసారి 400 సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న మోడీ – షా ద్వయం ఇందుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇక తాజాగా మూడోసారి అధికారంలోకి రావడమే టార్గెట్‌గా ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం 100 మందితో ఫస్ట్ లిస్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో మోడీ,అమిత్‌ షా, పలువురు కేంద్రమంత్రులతో పాటు తెలంగాణకు చెందిన ఒకరిద్దరు నేతల పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ నెల 29న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగే అవకాశం ఉండగా అదే రోజు ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో వారణాసి నుండి పోటీ చేసి గెలిచిన మోడీ ఈసారి అక్కడి నుండే పోటీ చేయనున్నారు. ఇక అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుండి పోటీ చేయనున్నారు. ఇక ఫస్ట్ లిస్ట్‌లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతుండగా ఏపీ నుండి పురందేశ్వరి పేరు ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తంగా హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -