టీటీడీ దేవస్థానం గుడ్ న్యూస్ తెలిపింది. టీటీడీ, దేవదాయ శాఖ సంయుక్త సమావేశంలో పలు కీలక నిర్ణయాలతో పాటు నిరుద్యోగులైన వేద పండితులకు భృతి ఇవ్వాలని నిర్ణయించారు.
మంత్రి ఆనం, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగగా గతంలో సీఎం సమీక్షలో ఆలయాలకు చెందిన కొన్ని సమస్యలు వచ్చాయి.. ఆయా సమస్యలపై చర్చించి రావాలని సీఎం ఆదేశించారు అని చెప్పారు.
9 శాతం కామన్‌గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాలని నిబంధనలు.. గతంలో 5 శాతం ఉన్న దాన్ని 9 శాతానికి పెంచాం రాష్ట్రంలో 590 మంది వేదపండితులు నిరుద్యోగులుగా ఉన్నారు అన్నారు. నిరుద్యోగులైన వేదపండితులకు రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయం..శ్రీవాణి ట్రస్టు నిధులపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు చెప్పింది అన్నారు.
దుర్గగుడికి మరో రోడ్డు వేసేందుకు టీటీడీ సహకారం కావాలి.. టీటీడీ కాలేజ్, పాఠశాలల్లో 192 పోస్టుల భర్తీకి చర్చించాం అన్నారు. టీటీడీలో అన్య మతస్థులు ఉన్నారన్నది వాస్తవం.. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది అన్నారు.
