Thursday, May 2, 2024
- Advertisement -

తెలంగాణలో కరోనా విజృంభణ.. ఒక్క రోజులో 46 మంది మృతి!

- Advertisement -

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5,892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 46 మంది మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారని ఆరోగ్యశాఖ పేర్కొంది. అదే సమయంలో 9,122 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,640కి చేరింది.

ఇప్పటివరకు మొత్తం 4,05,164 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,625గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 84.12 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54శాతంగా ఉందని చెప్పింది.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,104, రంగారెడ్డి జిల్లాలో 443, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 378, వరంగల్‌ అర్బన్‌లో 321, నల్గొండలో 323, కరీంనగర్‌లో 263, నాగర్‌ కర్నూల్‌లో 204, సిద్దిపేటలో 201 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మరోవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ 45 సంవత్సరాలు ఉన్నవారికి ఇస్తున్నారు.

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ గాయకుడు మృతి

తమిళనాడు సీఎం గా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం…

నేటి పంచాంగం, శుక్రవారం (07-08-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -