Wednesday, May 15, 2024
- Advertisement -

ద‌క్షిణం మిన‌హా దేశ‌మంతా బీజేపీనే

- Advertisement -
  • 19 రాష్ట్రాల్లో క‌మ‌లం, మిత్ర‌పక్షాలవే
  • కేవ‌లం నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌

ఒక‌ప్పుడు దేశ‌మ్మొత్తం ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాషాయ పార్టీ నిలిచింది. పూర్వం 18-90 ద‌శాబ్దంలో దేశంలోని అన్ని రాష్ట్రాలను ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కేవ‌లం ఐదారు రాష్ట్రాల‌కు కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాలు ప‌రిపాలిస్తున్నాయి. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ రానురాను క్షీణించిపోతోంది. తాజాగా క‌మ‌లం పూల బుట్ట‌లో మ‌రో పువ్వు (హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌) వ‌చ్చి చేరింది. గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో బీజేపీ జ‌య‌కేత‌నం ఎగ‌ర‌డంతో దేశ‌వ్యాప్తంగా బీజేపీ మ‌రో అడుగు వేసింది.

దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో 19 రాష్ట్రాల్లో బీజేపీ, క‌మ‌లం మిత్ర‌ప‌క్షాలు ప‌రిపాలిస్తున్నాయి. ఇప్పుడు కేవ‌లం కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌, కర్ణాటక, మేఘాలయ, మిజోరంల‌లో మాత్ర‌మే అధికారంలో ఉంది. తమిళనాడులో ఏఐఏడీఎంకే, పశ్చిమ్‌బంగాలో తృణమూల్‌ కాంగ్రెస్‌, దిల్లీలో ఆమ్‌ఆద్మీ, తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) లాంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలో వామ‌ప‌క్ష పార్టీల పాల‌న‌ కొనసాగుతోంది.

ఇదిలా ఉండ‌గా వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌రిగే
అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గోవా, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, అస్సాం, ఉత్తరాఖండ్‌, రాజ‌స్థాన్‌, మ‌ణిపూర్‌
బీజేపీ మిత్ర‌ప‌క్షాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, జ‌మ్మూ కాశ్మీర్‌, నాగాలాండ్‌, సిక్కిం, ఒడిశా, పంజాబ్, పాండిచ్చేరి

ఈ విధంగా బీజేపీ, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాలు పాలిస్తున్నాయి. ఇక ఈ జాబితాలోకి వ‌చ్చే సంవ‌త్స‌రం మూడు రాష్ట్రాలు చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ విధంగా ఒక్క దక్షిణ భార‌త‌దేశం మిన‌హా బీజేపీ దేశం మొత్తం ఏలుతోంది. ఇప్పుడు ద‌క్షిణ భార‌త‌దేశం వైపు దృష్టి సారిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -