Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీ గెలుపుపై పవన్ సంచలన కామెంట్స్

- Advertisement -

అఖండ ప్రజాబలంతో గెలిచిన వైసీపీ గెలుపును గాలివాటంగా మార్చేసే కుట్రకు జనసేనాని పవన్ కళ్యాణ్ తెరతీయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు టీడీపీ పాలనపై విసుగుచెంది కసితో ఓటేశారు. టీడీపీకి లోపాయికారిగా పనిచేస్తూ ఓట్లడిగిన జనసేనాని పవన్ కళ్యాన్ ను సైతం ఓడించేశారు. అసలు వైసీపీ ప్రభంజనంలో టీడీపీ, బీ టీం జనసేన కూడా కొట్టుకుపోయింది.

అంతటి ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాక్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి మద్దతు ప్రకటించారు. రాజధానిని ఇక్కడి నుంచి కదలనివ్వనని హామీ ఇచ్చారు. కులం రంగు పులిపి ఏపీ రాజధానిని పులివెందులకో.. దోనకొండకు మారిస్తే మీ ఆటలు సాగనివ్వమని పవన్ హెచ్చరించారు.

ఇక వైసీపీ దూకుడుగా వెళుతున్న తీరుపై కూడా పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాలం గొప్పతనమో లేక ఈవీఎంల ఘనతతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిదంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు. ప్రజావ్యతిరేక విధానాలను జగన్ తెలివిగా బొత్స లేదా మంత్రి అనిల్ తో చెప్పిస్తున్నారని మండిపడ్డారు. బొత్స ఇలానే చెబితే ఆయనపైనున్న వోక్స్ వ్యాగన్ కేసు బయటకు వస్తుందని.. రాజధాని మారిస్తే మోడీషాలకు ఫిర్యాదు చేస్తానని పవన్ హెచ్చరించారు.

ఇప్పుడు పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బొత్స, అనిల్ ల ద్వారా జగన్ నరుక్కొస్తున్నారని.. వైసీపీ గెలుపును కించపరిచేలా చేసిన పవన్ పై వైసీపీ ఏ రకంగా ఎదురుదాడి చేస్తుందనేది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -