- Advertisement -

నాలుగేళ్ళవుతున్నా అవే డ్రామాలా? బాబు అండ్ కో చిత్తశుద్ధి ఇదేనా?

- Advertisement -

సేం ఓల్డ్ స్టోరీ అనే ఫేమస్ డైలాగ్ బాబుకు భలే సూట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం కథలు చెప్పాడో…..ఏ కహానీలు వినిపించాడో ….మూడున్నరేళ్ళ తర్వాత కూడా అవే కథలు చెప్తున్నాడు మరి. ఇక బాబు భజన బ్యాచ్ మొత్తం కూడా ఆహా….అద్భుతః….పరమాద్భుతః అంటూ మూడున్నరేళ్ళ నుంచీ సేం ఓల్డ్ భజననే వినిపిస్తున్నారు. మొత్తానికి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అథఃపాతాళానికి తొక్కేసే ప్రయత్నం మాత్రం దిగ్విజయంగా చేస్తున్నారు. అదేమంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తనకు ఉన్నంత చిత్తశుధ్ది ఇంకెవరికీ లేదని చంద్రబాబు ఆవేశపడిపోతాడు. బాబు భజన చేయకుండా విమర్శించేవాళ్ళందరూ కూడా అభివృద్ధి నిరోధకులు అని విరుచుకుపడిపోతారు. కానీ బాబుతో పాటు టిడిపి నేతల చర్యలను గమనిస్తున్న ఎవరికైనా వాళ్ళు ఆడుతున్న డ్రామాలు మాత్రం చాలా సులభంగా అర్థమయిపోతాయి.

తాజాగా టిడిపి ఎంపిలు నరేంద్రమోడీని కలిశారు. అటూ ఇటూగా పదినిమిషాల భేటీలో నరేంద్రమోడీతో వాళ్ళు ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మీడియాకు ఎంట్రీ లేదు. మోడీని కలిసి బయటకు వచ్చాక టిడిపి ఎంపిలు చెప్పిన మాటలు మాత్రం నవ్వుతెప్పించేలా…… ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనా శక్తిని ఎటకారం చేసేలా ఉన్నాయి. హోదా పేరు ఒక్కటే చెప్పలేదు కానీ చట్టంలో ఉన్న అన్ని హామీలు, పోలవరం, ప్యాకేజ్, జోన్‌, రాజధాని నిధులు లాంటి అన్ని అంశాల్లోనూ సత్వరమే చర్యలు తీసుకుంటానని నరేంద్రమోడీ చెప్పారని, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని, ఆంద్రప్రదేశ్ అభివృద్ధి విషయం తనకు వదిలేయాలని, చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధిపథాన నడిపిస్తానని టిడిపి ఎంపిలకు మోడీ చెప్పారట. ఇదే విషయాన్ని టిడిపి ఎంపిలు మీడియాతో పంచుకున్నారు. ఇక బాబు భజన బృందం మొత్తం కూడా టిడిపి ఏదో సాధించేసింది అనే స్థాయిలో ప్రచారం మాత్రం చేసుకున్నారు.

అసలు విషయం ఏంటంటే నాదీ మోడీది అభివృద్ధి జోడీ…. మాకు ఓట్లేయండి…… విభజనలో బిజెపి పాపంలేదు…. హోదా రావాలంటే నాకు, మోడీకే ఓటెయ్యాలి అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన క్షణం నుంచీ ఈ రోజు వరకూ టిడిపి ఆడుతున్న డ్రామాలు ఇవే. ప్రతిసారీ ఇదే రికార్డ్ వినిపిస్తూ ఉంటారు. కానీ మోడీ చేత కనీస స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేయించలేకపోతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు అండ్ బ్యాచ్ పూర్తిగా డిజాస్టర్ అయ్యారన్నది నిజం. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి 2019వరకూ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకూ అమూల్యమైన సమయం. విభజన నాటి హామీలన్నీ ఈ టెర్మ్‌లోనే రావాలి. టెర్మ్ దాటిపోయిందంటే విభజన చట్టంలో ఉన్నవి రాష్ట్రానికి రావడం కష్టం. అయినప్పటికీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలిపెట్టి మరీ మూడున్నరేళ్ళ తర్వాత కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ ఇలాంటి డ్రామాలు ఆడుతుండడం మాత్రం బాధాకరం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -