వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అఖిలప్రియకు మంత్రి పదవిని కట్టబెట్టారు బాబు. భూమా వర్గంనుంచి వ్యతిరేకత రాకుండా పర్యాటక శాఖను అఖిలకు అప్పగించారు. మొదటినుంచి మంత్రి తన శాఖమీద పట్టుసాధించడంలో విఫలమవుతోందని….మంత్రి దగ్గరకు వచ్చిన ఫైళ్లను క్లియర్ చేయాలంటె ఎక్కువ టైం తీసుకుంటోందని బాబు పలు మార్లు వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు మాటల్లోనె చెప్పిన బాబు ఇప్పుడు చేతల్లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అఖిలను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు బాబు చేతికి ఆయుధం దొరికింది. దీంతో పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైందనె చెప్పాలి.
పర్యాటకశాఖ నిర్వక్ష్యం కారనంగానె ఫెర్రీబోటు ప్రమాదంలో 22 మంది చనిపోయిన ఘటనలో మంత్రి అఖిల స్పందించడంలో విఫలమయ్యారని బాబు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక శాఖ నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదం జరిగిందని ధృవీకరించేశారన్నమాట. ఆ లెక్కన, పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ నైతిక బాధ్యత వహిస్తూ, మంత్రి పదవికి రాజీనామా చేసెయ్యాలని ఇన్‌డైరెక్టుగా అఖిలకు చెప్పినట్లు సమాచారం.
బోటు ప్రమాదంపై సీఎం వద్ద జరిగిన సమావేశంలో మంత్రి అఖిలతోపాటు…ఆశాఖ ముఖ్య అధికారి కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల వైఫల్యంగానె ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెల్తున్నాయని ఆసహనం వ్యక్తం చేశారు సీఎం. ఇటువంటి సంఘటనలు జరిగితె మంత్రులు రాజీనామ చేస్తారని బాబు వ్యాఖ్యానించారు. అదికూడా అఖిల ప్రియముందే. ఇప్పడు కాకపోయినా మంత్రి వర్గ విస్తరనలో అఖిలను తప్పించేదానికి సంకేతాలు ఇచ్చారనే చెప్పుకోవాలి.
చంద్రబాబు చేసిన వ్యాఖలను చూస్తే తన రాజీనామ కోరుతున్నారనె విషయం మంత్రి అఖిలకు అర్థమయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి అఖిలఏంచేస్తారన్నది అసక్తికరంగా మారింది. వీటన్నింటిని బట్టి చూస్తే ఎక్కువ కాలం మంత్రిగా అఖిల కొనసాగడం అనేది సాధ్యం కాదనేది అధికార పార్టీ నాయకులు సెలవిస్తున్నారు.
