Thursday, May 16, 2024
- Advertisement -

పాకిస్థాన్ రాజకీయాలలోకి పవర్ ఫుల్ వనిత..!

- Advertisement -

పాకిస్థాన్​ దివంగత ప్రధానమంత్రి బెనజీర్​ భుట్టో చిన్న కుమార్తె అసీఫా భుట్టో జర్దారీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పాకిస్థాన్​ ప్రజాస్వామ్య ఉద్యమ కూటమి (పీడీఎం) ఆధ్వర్యంలో ముల్తాన్​లో సోమవారం నిర్వహించిన ర్యాలీ ద్వారా క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా.. ప్రజాస్వామ్యం కోసం తన తల్లి చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని, దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కోసం తన సోదరుడు బిలావల్​ భుట్టో చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

ముల్తాన్​లోని ఘంట ఘర్​ చౌక్​లో సోమవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించింది పీడీఎం. ఈ సమావేశంలో జమైత్​ ఉలేమా ఈ ఇస్లాం చీఫ్​ మౌలానా ఫజ్లర్​ రెహ్మాన్​, పీఎంఎల్​ ఎన్​ ఉపాధ్యక్షులు మరియం నవాజ్​ సహా పలువురు పీడీఎం నేతలు హాజరయ్యారు.

మీ సోదరుడు బిలావల్​ భుట్టో జర్దారీ కరోనా వైరస్​తో పోరాడుతున్న క్రమంలో నేను మీ మధ్యకు వచ్చాను. దేశ ప్రజాస్వామ్యానికి తల్లి, తూర్పు ప్రాంతానికి కూతురైన మా తల్లి బెనజీర్​కు మద్దతు ఇచ్చినట్లే.. పీడీఎం వేదికగా బిలావల్​ భుట్టో జర్దారీకి మద్దతుగా నిలవాలి అని అసీఫా భుట్టో జర్దారీ అన్నారు..

Also Read

ఊర్మిళా మొత్తానికి శివసేనలో..!

రాజ్యసభ సమావేశాల్లో మైక్ కట్..!

ఆరునెలల వరుకు మారను: ట్రంప్

సూపర్‌ స్టార్‌ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -