Monday, May 6, 2024
- Advertisement -

రాజ్యసభ సమావేశాల్లో మైక్ కట్..!

- Advertisement -

నూతన వ్యవసాయ చట్టాలను ఆమోదించే సమయంలో రాజ్యసభ టీవీ ఆడియో ఫీడ్​కు కొద్దిసేపు అంతరాయం కలగడంపై సెంట్రల్ పబ్లిక్ వర్క్స్​ డిపార్ట్​మెంట్(సీపీడబ్ల్యూడీ) స్పష్టతనిచ్చింది. కొంతమంది పార్లమెంట్ సభ్యుల కారణంగా ఛైర్మన్​ మైక్రోఫోన్ దెబ్బతినడం వల్లే అంతరాయం ఏర్పడిందని తెలిపింది. పార్లమెంట్ భవన నిర్వహణను పర్యవేక్షించే సీపీడబ్ల్యూడీ.. ఈమేరకు రాజ్యసభ సచివాలయానికి లేఖ రాసింది.

ఆ సమయంలో ఛైర్మన్ మైక్ మినహా ఏ ఇతర మైక్రోఫోన్ కూడా ఆన్​లో లేదని తెలిపింది సీపీడబ్ల్యూడీ. దీనికి మరే ఇతర సాంకేతిక సమస్యలు లేవని స్పష్టం చేసింది. సంబంధిత నిబంధనల అనుసారం ఆడియోను పునరుద్ధరించడానికి అరగంట సమయం పట్టిందని వివరించింది.

రాజ్యసభ సమావేశాల్లో కావాలనే ఆడియోను రానీయకుండా చేశారని విపక్ష పార్టీలు గతంలో ఆరోపణలు చేశాయి. తమ అభిప్రాయాలు ప్రజలకు వినిపించకుండా చేసేందుకే ఇలా చేశారని మండిపడ్డాయి.

Also Read

తమిళనాట రూ.450 కోట్ల నల్ల డబ్బు పట్టివేత..!

రూ.200 కే హత్య.. మత్తు వదలదా..!

అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..!

మొదటి లవ్​ జిహాద్ కేసు నమోదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -