Monday, April 29, 2024
- Advertisement -

ఉత్తరాంద్రలో బలపడుతోన్న జగన్ టీమ్

- Advertisement -

ఎల్లో మీడియా చేస్తోన్న వ్యవహారాలకు చాలామందిలో ఒకరకమైన అపోహ ఫేక్ న్యూస్ తిరుగుతూ ఉంది. అదేంటంటే… వచ్చే ఎలక్షన్స్ లో కూడా టీడీపిదే రాజ్యమంట కదా అని. చాలామంది జనాల్లో కూడా ఈ రకమైన మాటలు మాట్లాడుకునే స్థితికి టిడిపి తన ఎల్లో మీడియా సాయంతో ఈ అభిప్రాయాన్ని తీసుకు వచ్చేసింది. దానికి కారణం…అబద్దాన్ని నిజం నిజం అంటూ పదిసార్లు చెప్పడమే. ఇదే సూత్రం టిడిపి రాజగురువు రామోజి అండదండలు ఉన్న దగ్గరనుంచి కలిసొస్తుందంటూ ఉంటారు.

కాని నేటి ఆధునిక కాలంలో ఎవడి డబ్బా వాడు కొట్టుకునే కాలం వచ్చేసరికి .. ఎల్లోమీడియాకు కలిసొచ్చిన సూత్రం ..ఇపుడు వర్కవుట్ కావడం లేదు. అది కూడా ఉత్తరాంద్రలో ఈ విషయంలో తొలిదెబ్బ తగిలింది. ఉత్తరాంద్ర అంటేనే బిసి డామినేషన్ ఏరియా. అలాంటి ఏరియాలో జగన్ టీమ్ కు జనాలు ,అందుల్లోను విద్యావంతులు వత్తాసు పలకడం చూస్తుంటే… పరిస్థితుల్లో వచ్చిన మార్పును మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం.

శ్రీకాకుళం,విజయనగరంలో ఇపుడిపుడే… బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో బాబు అండ్ కో చేస్తోన్న అరాచకాలను బయటకు తీస్తూ… ఎక్కడ ఎవరికి ఎలా పెట్టాలో అలా పెడుతూ…వాయింపులు ఇస్తున్నాడు. ఇక అక్కడి చదువుకుంటోన్న విద్యార్ధులు టిడిపి ప్రభుత్వం చేసే కొన్ని చేతకాని పనులను తమ మొబైల్స్ సాయంతో వైరల్ చేస్తూ…ఉన్న పరువును కాస్త తీసేస్తున్నారు. అసలే వచ్చే ఎన్నికలలో తనకు తొలి దెబ్బ ఉత్తరాంద్రనుంచే అనే విషయం బాబుకు భాగా అర్ధమైపోయింది. దీని కోసమని అమరావతిలో లోకేష్ బాబు రిక్రూట్ చేసుకున్న 600 మంది జనాలను ముందుగా ఉత్తరాంద్రపై పడమని బాబుగారు ఆజ్ఞలు జారిచేసినట్లుగా తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -