Saturday, May 4, 2024
- Advertisement -

చంద్ర‌బాబుపై గంటా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై సీబీఐ విచార‌ణ‌కు రంగం సిద్ధ‌మ‌య్యిందా…? కేంద్రం నుంచి ఆదిశ‌గా సంకేతాలు వ‌స్తున్నాయా..? అవున‌నే సంకేతాలు వెల‌వ‌డుతున్నాయి. అది కూడా సొంత పార్టీలోనే ఇలాంటి అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

ప్ర‌త్యోక‌హోదా, విభ‌జ‌న హామీల‌ను భాజాపా అమలు చేయ‌క పోవ‌డంతో ఎన్డీఏ నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తితి తెలిసందే. తాజాగా టీడీపీ మంత్రి గంటా బాబు సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం రెడీ అవుతోందిని దీనికి సంబందించిన స‌మాచారం ఉంద‌ని ఎలాంటి విచార‌ణ‌కైనా సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.

ప్ర‌ధానంగా పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి అంటూ సీబీఐ అడుగు పెట్టనుందని, ఒకప్పుడు బీజేపీ నేతలైన విష్ణుకుమార్ రాజు వంటివారు ఆ ప్రాజెక్టును ఎంతో మెచ్చుకుని ఇప్పుడు విమర్శిస్తున్నారని, వారి విమర్శల వెనుక కేవలం రాజకీయ కుట్ర మాత్రమే దాగుందని విమర్శించారు.

చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించాలని మోదీ భావిస్తున్నారని, అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరి ఉచ్చులోనూ పడబోరని అన్నారు. చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని ప్రయత్నించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన ఆయన, తండ్రి వల్లే కానిది కొడుకు జగన్ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు.

అసెంబ్లీ స‌మావేశాల్లో కూడా భాజాపా ప్లోర్‌లీడ‌ర్ విష్ణుకుమార్ రాజుకూడా ప‌ట్టిసీమ‌, పోల‌వ‌రం ప్రాజెక్టుల‌ల్లో అవినీతి జ‌రిగింద‌ని వాటిపై స‌బీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. అవ‌స‌రం అయితే కేంద్రానికి లేఖ కూడా రాస్తామ‌ని వెల్ల‌డించారు. ఇప్పుడు ఆదిశ‌గానే కేంద్రం అడుగులేస్తోంనే భావ‌న వినిపిస్తోంది. క‌ర్నాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు అవినీతిపై సీబీఐ విచార‌ణ జ‌రుగుతుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. అది కూడా టీడీపీ మ‌త్రి నోటినుంచే ఈ వ్యాఖ్య‌లు రావ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -