- Advertisement -

మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి పేరును ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి కోస్గిలో పర్యటించిన రేవంత్…తన నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. ఇదే సందర్భంగా తొలి అభ్యర్థిగా వంశీ పేరును ప్రతిపాదిస్తున్నాని,తనను 50 వేల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

2014లో కల్వకుర్తి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు వంశీచంద్ రెడ్డి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. వంశీ చంద్ స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా, సేరి అప్పారెడ్డిపల్లి గ్రామం. విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ తర్వాత యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో కల్వకుర్తి నుండి బీజేపీ అభ్యర్థిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. 2018లో ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు కాగా మరోసారి అదే స్థానం నుండి పోటీ చేయనున్నారు వంశీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -