Tuesday, May 14, 2024
- Advertisement -

టీడీపీ సీనియర్ నేతకు షాకిచ్చిన బాబు!

- Advertisement -

ఊహించిందే జరుగుతోంది. పొత్తు పేరుతో టీడీపీ సీనియర్లకు చంద్రబాబు చెక్ పెడుతున్నారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు..ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్లు బచ్చయ్య చౌదరికి సీటు లేదు. రాజమండ్రి రూరల్ స్థానం నుంచి జనసేన అభ్యర్ది పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రిలో పార్టీ నేతలతో సమావేశమైన పవన్ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి బరిలో నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే తూర్పు గోదావరిలో రాజానగరం, రాజోలు స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించి ఉన్నారు. ఇప్పుడు జిల్లా సమీక్షలో రాజమండ్రి రూరల్ సైతం తన పార్టీ అభ్యర్దే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

సిట్టింగ్ లకు తిరిగి సీట్లు కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించిన అంశాన్ని తాజాగా బుచ్చయ్య చౌదరి గుర్తు చేసారు. సిట్టింగ్ సీట్లు జనసేనకు ఇచ్చేదే లేదని స్పష్టం చేసారు. దుర్గేష్ ఏం ఆలోచిస్తారో తనకు అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు. అసలు టీడీపీ వాళ్లు త్యాగాలు చేయటం ఏంటి..జనసేన కూడా త్యాగాలు చేయాలని రివర్స్ అయ్యారు. తనకు సీటు ఇస్తారని కందుల దుర్గేష్ ప్రయత్నం చేసుకోవచ్చని తాను పోటీ చేయటం ఖాయమని బుచ్చయ్య ప్రకటించారు. గెలిచానని..రాజానగరం సీటు జనసేనకు ఇచ్చారంటే రాజమండ్రి రూరల్ ఇవ్వరనేది అర్దం చేసుకోవాలని దుర్గేష్ కు సూచించారు. రాజానగరం నుంచి దుర్గేష్ పోటీ చేయవచ్చని పరోక్షంగా చెప్పుకొచ్చారు. కానీ, పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ సీటు కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని తేల్చేసారు. దీంతో అసలు కుస్తీ మొదలైంది.

చంద్రబాబు ఏనాడు బుచ్చయ్య లాంటి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదు. చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ తో అధికారంలోకి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ మద్దతుదారుగా వ్యవహరించారు. మాగంటి మురళీ మోహన్ లాంటి వారిని రాజమండ్రి ఎంపీగా బరిలో దింపిన చంద్రబాబు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా 2014లో మంత్రి పదవి ఇవ్వలేదు. ఇప్పుడు బుచ్చయ్య లాంటి వారికి సీటు లేకుండా ఎమ్మెల్సీ ఇస్తామనే హామీకి సిద్దమవుతున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ సీట్లు తిరిగి దక్కాలంటే 2026 లో మాత్రమే సాధ్యం. అది కూడా ప్రస్తుత ఎన్నికల్లో దక్కే అసెంబ్లీ సీట్లతో ముడిపడి ఉంది. ఇప్పటికే పలువురు సీట్లు లేని నేతలకు ఎమ్మెల్సీ హామీ ఉంది. మరి..బుచ్చయ్య చౌదరి నిర్ణయం ఏంటనేది ఇంట్రస్టింగ్ ఎపిసోడ్.

ఇదే సమయంలో రాజానగరంలో అభ్యర్ది విషయంలోనూ పవన్ కొత్త ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. రాజా నగరంలో జనసేన పోటీ చేస్తుందని చెబుతూనే..అభ్యర్ది విషయంలో మాత్రం సస్పెన్స్ పెంచారని సమాచారం. ఇటు జగన్ పూర్తిగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్లు ఖరారు చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి శెట్టి బలిజ వర్గానికి చెందిన మంత్రి వేణుకు సీటు కేటాయించారు. పొత్తులో భాగంగా చంద్రబాబు , పవన్ ఆ జిల్లాలో కాపు – కమ్మ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, సామాజిక సమీకరణాలు వైసీపీకి అనుకూలంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్లకే టీడీపీలో సీట్లు దక్కకపోవటంతో ఓటు బదిలీ ఏమేర జరుగుతుందనే డౌట్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. పొత్తుతో ఎక్కడైతే ఆధిపత్యం దొరుకుతుందని చంద్రబాబు, పవన్ భావించారో అక్కడే ఇప్పుడు ఇద్దరు సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. అసలు ఆట ఇప్పుడు మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -