చంద్రబాబు కు వాడుకుని వదిలేయడం వెన్నుపోటు తో పెట్టిన విద్య.. ఈ విద్య తన మన అనే భేదం ఉండదు తనకు అడ్డొచ్చేది సొంత మామ అయినా సరే తనదగ్గర ఉన్న వెన్నుపోటు అస్త్రంతో పొడిచి పైకి వస్తుంటారు.. అయితే బయటకి తెల్సి ఒకటే, చెప్పుకోదగ్గ లీడర్లు కానీ ఎంతోమంది ని చంద్రబాబు అణగదొక్కారనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. అయితే కుందేలును మేపి మేపి చివరకు కోసుకుని తిన్నట్లు చంద్రబాబు వెన్ను పోటు పొడిచినట్లు పొడిచిన వారికి ఏమాత్రం తెలీదు.. మెల్ల మెల్లగా వారికి అర్థమవుతుంది.. అందుకే చంద్రబాబు ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నారు.. అయితే ఇదేవిధంగా ఆయన వైఖరి రాజకీయంగా ఎంతో పేరున్న దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబంపై చూపిస్తున్నారట..
డీకే ఫ్యామిలీ చాల కాలంగా చంద్రబాబు హయం లో ప్రజలు సేవ చేస్తుంది. ప్రజలకే చాలాసార్లు పార్టీ కి కూడా నిధులు సమకూర్చింది అంటారు.. 2007లో చంద్రబాబు చేపట్టిన మీకోసం యాత్రకు కూడా భారీగా నిధులు సమకూర్చారన్న టాక్ ఉంది.ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లారు.. నాడు కాంగ్రెస్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీడీపీ ఎంపీగా ఉండి ఓటేసినందుకు గాను ఆయన వైఎస్ టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన మరణం తర్వాత 2014 లో అయన సతీమణి సైకిల్ పార్టీ తరపున పోటీ చేశారు. అయితే ఆ సమయంలో ఆమెకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని టీడీపీ లో టాక్.. సత్యప్రభను చంద్రబాబు బలవంతంగా రాజంపేట ఎంపీ స్థానం నుంచి పోటీచేయించారు. దాంతో ఓడిపోతామని తెలిసినా ఆమె అక్కడ పోటీ చేసి ఓడిపోయారు..
దాంతో పార్టీ కి దూరం ఉన్న ఆమెను చంద్రబాబు కూడా ఎక్కువగా పట్టించుకోలేదు.. దాంతో ఆమె నియోజక వర్గంలో మరో లీడర్ ని తాయారు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారట.. పార్టీ కోసం భారీ విరాళాలు ఇచ్చిన ఈ ఫ్యామిలీ ని ఇలా లైట్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటున్నారు.. అంతేకాదు కొద్ది రోజుల క్రితం ఆమె వ్యాపారాలు, విద్యాసంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే ఆమె చంద్రబాబు సాయం కోరినా లైట్ తీస్కొన్నారట. నిజానికి ఇలాంటి వారిని చంద్రబాబు కాపాడుకోల్సిన అవసరం ఉన్నప్పటికీ.. ఆయన ఉదాసీనతే పార్టీని భ్రష్టు పట్టిస్తోంది. ఇలా చేస్తే సొంత నాయకులే చంద్రబాబుపై ఉద్యమం లేవనెత్తే అవకాశం ఉంది..
